రిలయెన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్. జియో మరో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. '4ఎక్స్ బెనిఫిట్స్ ఆఫర్' అంటే నాలుగు రెట్లు లాభాలు పొందండి అంటూ యూజర్లకు మంచి ఛాన్స్ ఇచ్చింది. ఈ ఆఫర్ జూన్ నెలలోనే ఉంటుంది. జూన్‌లో జియో యూజర్లు రూ.249 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేస్తే రెగ్యులర్‌గా వచ్చే బెనిఫిట్స్‌తో పాటు మరిన్ని లాభాలు పొందొచ్చు. ఇందుకోసం రిలయెన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్ ఫుట్‌వేర్, ఏజియోలతో ఒప్పందం కుదుర్చుకుంది రిలయెన్స్ జియో. యూజర్లు ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫుట్‌వేర్‌పై డిస్కౌంట్స్ పొందొచ్చు. రూ.249 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసేవారికి డిస్కౌంట్ కూపన్స్ లభిస్తాయి. వాటిని రిలయెన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్ ఫుట్‌వేర్, ఏజియోలో ఉపయోగించి డిస్కౌంట్ పొందొచ్చు.
రిలయెన్స్ జియో సబ్‌స్క్రైబర్లు అందరూ ఈ ఆఫర్ పొందొచ్చు. పాత యూజర్లు మాత్రమే కాదు, కొత్తగా జియో సిమ్ తీసుకునేవారు కూడా ఈ ఆఫర్స్ పొందొచ్చు. రూ.249 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేయగానే మైజియో యాప్‌లో కూపన్స్ సెక్షన్‌లో డిస్కౌంట్ కూపన్స్ క్రెడిట్ అవుతాయి. అడ్వాన్స్ రీఛార్జ్ చేసేవారు కూడా ఈ ఆఫర్స్ పొందొచ్చు. అంటే మీ ప్రస్తుత ప్లాన్ వేలిడిటీ పూర్తి కాకపోయినా రీఛార్జ్ చేయొచ్చు. మైజియో యాప్‌లో మై ప్లాన్స్ సెక్షన్‌లో మీరు రీఛార్జ్ చేసిన ప్లాన్ క్యూలో ఉంటుంది. పాత ప్లాన్ గడువు పూర్తైన తర్వాత కొత్త ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. జూన్ 30 లోపు రీఛార్జ్ చేసేవారు మాత్రమే ఈ ఆఫర్స్ పొందడానికి అర్హులు. మరి రిలయెన్స్ జియోలో ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Good News: జన్ ధన్ ఖాతాలోకి డబ్బులు... ఎవరికి ఎప్పుడంటే
PAN Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్... తీసుకోండి ఇలా
PM Jandhan Yojana: జన్ ధన్ ఖాతాల్లోంచి ఎంత డ్రా చేస్తున్నారో తెలుసా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Reliance Jio