ఫేస్బుక్ ఫ్యూయెల్ ఫర్ ఇండియా ఫస్ట్ ఎడిషన్ ఈవెంట్ ప్రారంభమైంది. ఈ ఈవెంట్లో భారతదేశంలో డిజిటల్ ప్లాట్ఫామ్లో గల అవకాశాలపై చర్చించారు. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి తన సహకారాన్ని అందించేందుకు ఫేస్బుక్ ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు అనేక మంది స్పీకర్లు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. ఫేస్బుక్-రిలయన్స్ జియో భాగస్వామ్యం గురించి రిలయెన్స్ జియో డైరెక్టర్లు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ వివరించారు. జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ జియో ఎకోసిస్టమ్ ద్వారా డిజిటల్ ఫస్ట్ సర్వీసెస్‌ని అందరికీ అందిస్తున్నామన్నారు.
జియో ద్వారా 40 కోట్ల మంది ప్రజల్ని కనెక్ట్ చేశాం. 12 ఫస్ట్ పార్టీ యాప్స్ అందిస్తున్నాం. డిజిటల్ ఫస్ట్ సేవల్ని అందరికీ అందిస్తున్నాం. కొత్త తరానికి డిజిటల్ సేవల్ని అందించడంలో జియో ముందుంది.
— ఆకాశ్ అంబానీ, జియో డైరెక్టర్
రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ రిలయెన్స్ జియో ప్రారంభమైన తర్వాత భారతదేశం సాధించిన పురోగతి గురించి వివరించారు.
రిలయెన్స్ జియోను ప్రారంభించిన తర్వాత భారతదేశంలో తక్కువ ధరకే హై క్వాలిటీ సేవల్ని అందిస్తున్నాం. భారతదేశమంతా డిజిటల్ విప్లవం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఫేస్బుక్ ఫ్యూయెల్ ఫర్ ఇండియా ఈవెంట్ డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనుంది. రెండు రోజుల వర్చువల్ ఈవెంట్ ఇది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.