రిలయెన్స్ నుంచి జియో ఓ సంచలనమైతే... గిగాఫైబర్ మరో సంచలనం కానుంది. గిగాఫైబర్ సర్వీస్‌ను 2018 ఆగస్ట్‌లో ప్రకటించింది రిలయెన్స్ జియో. అప్పట్నుంచీ గిగాఫైబర్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు యూజర్లు. ప్రస్తుతం రిలయెన్స్ గిగాఫైబర్‌ను ప్రయోగాత్మకంగా పలుచోట్ల పరిశీలిస్తుంది కంపెనీ. ఇంకా అధికారికంగా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పటికే గిగాఫైబర్ ప్లాన్స్ గురించి మార్కెట్లో చర్చ జరుగుతోంది. గిగాఫైబర్ ప్యాకేజీలో నెలకు రూ.600 చెల్లిస్తే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్ లభిస్తుందని తాజా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... స్మార్ట్ హోమ్ నెట్వర్క్ ద్వారా ఏకంగా 40 డివైజుల్ని కనెక్ట్ చేయొచ్చని తెలుస్తోంది.
రిలయెన్స్ జియో గిగాఫైబర్ మొదట 29 పట్టణాల్లో ప్రారంభం కానుంది. న్యూఢిల్లీ, ముంబైలో పైలట్ టెస్టింగ్ జరుగుతోంది. రౌటర్ కోసం రూ.4,500 వన్ టైమ్ డిపాజిట్ చేస్తే 100 జీబీ డేటా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆఫర్ చేస్తోంది జియో. రిలయెన్స్ జియో గిగాఫైబర్ సేవలు మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. మొదటి ఏడాది ఈ సేవల్ని జియో ఉచితంగా ఇవ్వనుందని తెలుస్తోంది. జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తమ ప్రాంతంలో గిగాఫైబర్ సేవలు కావాలనుకునేవాళ్లు https://gigafiber.jio.com/registration వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి
https://gigafiber.jio.com/registration వెబ్సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో మ్యాప్ కనిపిస్తుంది.
యువర్ కరెంట్ లొకేషన్ దగ్గర అడ్రస్ టైప్ చేయొచ్చు.
లేదా మ్యాప్ పైన మీకు గిగా ఫైబర్ సేవలు కావాల్సిన ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు.
తర్వాతి పేజీలో మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి 'సబ్మిట్' పైన క్లిక్ చేయాలి.
Realme 3 Pro: రిలీజైన రియల్మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.