Jio GigaFiber: జియో గిగాఫైబర్ కనెక్షన్‌తో టీవీ ఉచితం... రిజిస్టర్ చేసుకోండి ఇలా

Reliance Jio GigaFiber | మీరు ఎంచుకునే గిగాఫైబర్ ప్లాన్‌ను బట్టి ఉచితంగా హెచ్‌డీ లేదా 4కే ఎల్ఈడీ టీవీ పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో ఉచితంగా ల్యాండ్‌లైన్ కనెక్షన్, 4కే సెట్ టాప్ బాక్స్ కూడా లభిస్తాయి.

news18-telugu
Updated: August 19, 2019, 4:05 PM IST
Jio GigaFiber: జియో గిగాఫైబర్ కనెక్షన్‌తో టీవీ ఉచితం... రిజిస్టర్ చేసుకోండి ఇలా
Jio GigaFiber: జియో గిగాఫైబర్ కనెక్షన్‌తో టీవీ ఉచితం... రిజిస్టర్ చేసుకోండి ఇలా
  • Share this:
టెలికామ్ రంగంలో రిలయెన్స్ జియో సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. ఇప్పుడు జియో గిగాఫైబర్ కూడా సంచలనాలకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 5న జియో గిగాఫైబర్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ప్లాన్స్ రూ.700 నుంచి రూ.10,000 వరకు ఉంటాయి. ఇంటర్నెట్ డేటా స్పీడ్ 100 ఎంబీపీఎస్‌తో మొదలై 1 జీబీపీఎస్ వరకు ఉంటుంది. అంతేకాదు... గిగాఫైబర్ కనెక్షన్స్‌తో ఆకర్షణీయమైన లాభాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు... మీరు ఎంచుకునే గిగాఫైబర్ ప్లాన్‌ను బట్టి ఉచితంగా హెచ్‌డీ లేదా 4కే ఎల్ఈడీ టీవీ పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో ఉచితంగా ల్యాండ్‌లైన్ కనెక్షన్, 4కే సెట్ టాప్ బాక్స్ కూడా లభిస్తాయి. గిగాఫైబర్‌తో వచ్చే బెనిఫిట్స్ అన్నీ సబ్‌స్క్రైబర్లు ఎంచుకునే ప్లాన్స్‌ను బట్టి ఉంటాయి. గిగాఫైబర్ కనెక్షన్ తీసుకోవడానికి మీకు ఆసక్తి ఉన్నట్టైతే అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి https://gigafiber.jio.com/registration వెబ్‌సైట్‌లో గిగాఫైబర్‌కు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.

Read this: JIO Gigafiber: సెప్టెంబర్ 5న గిగాఫైబర్ లాంఛ్... ప్రీమియం ప్లాన్‌తో టీవీ ఉచితం

1. ముందుగా జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
2. యువర్ కరెంట్ లొకేషన్‌లో మీరు గిగాఫైబర్ కనెక్షన్ కోరుకుంటున్న అడ్రస్ టైప్ చేయండి. లేదా పక్కనే ఉన్న మ్యాప్‌లో లొకేషన్ సెట్ చేయండి.
3. తర్వాత పేజీలో మీ పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ టైప్ చేసి ఓటీపీ జనరేట్ చేయండి.
4. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
5. రిలయెన్స్ జియో ఎగ్జిక్యూటీవ్ మీకు కాల్ చేసి మరిన్ని వివరాలు వెల్లడిస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూసి మీ ఐడీప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వెరిఫై చేస్తారు.First Smartphone: ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌‌ఫోన్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Alert: ఈ 85 ఫోటో, గేమింగ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? జాగ్రత్త... యాప్స్ లిస్ట్ ఇదే

Realme Days Sale: రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం... స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

Insurance: ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
First published: August 19, 2019, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading