Jio Fibernet: ఇవాల్టి నుంచి జియో ఫైబర్‌నెట్ సేవలు ప్రారంభం..

Reliance Jio Fibernet : జియో ఫైబర్ ప్లాన్స్ రూ.700 నుంచి రూ.10,000 మధ్య ఉంటాయని ప్రకటించగా... ఏఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయన్నది నేడు తేలనుంది. రూ.700 ప్లాన్ ఎంచుకున్న వారికి 100 ఎంబీపీసీ స్పీడ్‌తో డేటా లభిస్తుంది.

news18-telugu
Updated: September 5, 2019, 6:31 AM IST
Jio Fibernet: ఇవాల్టి నుంచి జియో ఫైబర్‌నెట్ సేవలు ప్రారంభం..
Jio Fiber: నేటి నుంచి జియో ఫైబర్ సేవలు (image: JIO)
news18-telugu
Updated: September 5, 2019, 6:31 AM IST
దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.. టెలికం రంగంలో సంచనాలతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. మరో సంచనానికి తెర తీసేందుకు రెడీ అయ్యింది. ఫైబర్‌నెట్ సేవలతో దేశ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు సిద్ధమైంది. ఫైబర్‌నెట్ సేవల్ని సెప్టెంబరు 5న ప్రారంభిస్తామని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించగా.. అందుకు తగ్గట్లే ఇవాళ ఫైబర్‌నెట్ సేవలు ప్రారంభం కానున్నాయి. తొలుత హైదరాబాద్‌తో పాటు ముంబై, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, వడోదర, విశాఖపట్నం లాంటి నగరాల్లో జియో ఫైబర్ సేవలు ప్రారంభం కానున్నాయి. జియో ఫైబర్ ప్లాన్స్ రూ.700 నుంచి రూ.10,000 మధ్య ఉంటాయని ప్రకటించగా... ఏఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయన్నది నేడు తేలనుంది. రూ.700 ప్లాన్ ఎంచుకున్న వారికి 100 ఎంబీపీసీ స్పీడ్‌తో డేటా లభిస్తుంది. గరిష్టంగా 1జీబీపీఎస్ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. అంటే ఒక సెకండ్‌లో 1 జీబీ స్పీడ్‌తో ఇంటర్నెట్ డేటా పొందొచ్చు.

అయితే, డీటీహెచ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రతీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు రిలయెన్స్ జియో ఉచితంగా సెట్-టాప్-బాక్స్ ఇవ్వనుందన్న వార్తలొస్తున్నాయి. టారిఫ్, ప్లాన్స్ వివరాలన్నీ నేడు తెలియనున్నాయి. వాస్తవానికి గత ఏడాదే జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 1600 పట్టణాల నుంచి 15 మిలియన్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. గత ఏడాదిగా 5 లక్షల ఇళ్లల్లో ప్రయోగాత్మకంగా గిగాఫైబర్ సేవలు అందుతున్నాయి.

Reliance Jio GigaFiber, Reliance Jio GigaFiber free hd 4k TV, Jio First Day First Show plan, Reliance Jio Microsoft partnership, Reliance Jio, Reliance Jio gigafiber, JioFibre plans, రిలయెన్స్ జియో గిగాఫైబర్, రిలయెన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, జియో ఫస్ట్ డే ఫస్ట్ షో ప్లాన్, రిలయెన్స్ జియో గిగాఫైబర్ ప్లాన్స్, రిలయెన్స్ జియో, రిలయెన్స్ జియో గిగాఫైబర్ 4కే టీవీ ఉచితం
42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఫైబర్‌నెట్ వివరాలను వెల్లడిస్తున్న ముకేశ్ అంబానీ


జియో గిగా ఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారికి ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి డేటా స్పీడ్ ఉంటుంది. ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. అంతేకాదు... గిగాఫైబర్ యాన్యువల్ ప్లాన్ తీసుకున్నవారికి హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీతో పాటు సెట్ టాప్ బాక్స్ ఉచితంగా లభించనుంది. 'జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్' పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే కేవలం ప్లాన్ ఛార్జీలు చెల్లిస్తే చాలు. హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితం.



Reliance Jio GigaFiber, Reliance Jio GigaFiber free hd 4k TV, Jio First Day First Show plan, Reliance Jio Microsoft partnership, Reliance Jio, Reliance Jio gigafiber, JioFibre plans, రిలయెన్స్ జియో గిగాఫైబర్, రిలయెన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, జియో ఫస్ట్ డే ఫస్ట్ షో ప్లాన్, రిలయెన్స్ జియో గిగాఫైబర్ ప్లాన్స్, రిలయెన్స్ జియో, రిలయెన్స్ జియో గిగాఫైబర్ 4కే టీవీ ఉచితం
యాన్యువల్ ప్లాన్‌తో 4K టీవీ ఉచితం


ఇక జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడొచ్చు. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' పేరుతో జియో అందిస్తున్న మరో అద్భుతమైన సర్వీస్ ఇది. జియో గిగాఫైబర్ ప్రీమియం కస్టమర్లు... ఏ సినిమా ఎప్పుడు రిలీజైనా మీరు ఇంట్లోనే చూడొచ్చు. కేవలం ప్రీమియం కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. వచ్చే ఏడాదిలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.
First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...