Jio Fiber: నేడే అధికారికంగా జియో ఫైబర్ లాంఛింగ్... ప్రత్యేకతలివే

Reliance Jio Fiber | జియో ఫైబర్ ప్లాన్స్ రూ.700 నుంచి రూ.10,000 మధ్య ఉంటాయని ప్రకటించినా... ఏఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయన్నది తెలియాల్సి ఉంది.

news18-telugu
Updated: September 5, 2019, 8:23 AM IST
Jio Fiber: నేడే అధికారికంగా జియో ఫైబర్ లాంఛింగ్... ప్రత్యేకతలివే
Jio Fiber: నేటి నుంచి జియో ఫైబర్ సేవలు (image: JIO)
news18-telugu
Updated: September 5, 2019, 8:23 AM IST
రిలయెన్స్ జియో... టెలికామ్ రంగంలో ఓ సంచలనం. ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటికీ రిలయెన్స్ జియో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు జియో నుంచి బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ సేవలు వచ్చేస్తున్నాయి. సెప్టెంబర్ 5న రిలయెన్స్ జియో ఫైబర్ అధికారికంగా రిలీజ్ కాబోతోంది. డీటీహెచ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రతీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు రిలయెన్స్ జియో ఉచితంగా సెట్-టాప్-బాక్స్ ఇవ్వనుందన్న వార్తలొస్తున్నాయి. టారిఫ్, ప్లాన్స్ వివరాలన్నీ గురువారం వెల్లడికానున్నాయి. మొదట హైదరాబాద్‌తో పాటు ముంబై, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, వడోదర, విశాఖపట్నం లాంటి నగరాల్లో జియో ఫైబర్ సేవలు ప్రారంభం కానున్నాయి. గతేడాది జియో ఫైబర్ ప్రకటించిన నాటి నుంచీ అందరిలో ఆసక్తి నెలకొంది. ఇటీవల రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఫైబర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ వెల్లడించడంతో గిగాఫైబర్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో ఫైబర్ ప్లాన్స్ రూ.700 నుంచి రూ.10,000 మధ్య ఉంటాయని ప్రకటించినా... ఏఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయన్నది తెలియాల్సి ఉంది. రూ.700 ప్లాన్ ఎంచుకున్న వారికి 100 ఎంబీపీసీ స్పీడ్‌తో డేటా లభిస్తుంది. గరిష్టంగా 1జీబీపీఎస్ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. అంటే ఒక సెకండ్‌లో 1 జీబీ స్పీడ్‌తో ఇంటర్నెట్ డేటా పొందొచ్చు.

వాస్తవానికి గతేడాదే జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 1600 పట్టణాల నుంచి 15 మిలియన్ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. గత ఏడాదిగా 5 లక్షల ఇళ్లల్లో ప్రయోగాత్మకంగా గిగాఫైబర్ సేవలు అందుతున్నాయి. సెప్టెంబర్ 5న జియో గిగాఫైబర్ సేవలు అధికారికంగా ప్రారంభం అవుతాయి. 12-18 నెలలలో 20 మిలియన్ అంటే రెండు కోట్ల ఇళ్లకు గిగాఫైబర్ సేవలు అందించడమే జియో లక్ష్యం. జియో గిగాఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారికి ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి డేటా స్పీడ్ ఉంటుంది. ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. అంతేకాదు... గిగాఫైబర్ యాన్యువల్ ప్లాన్ తీసుకున్నవారికి హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీతో పాటు సెట్ టాప్ బాక్స్ ఉచితంగా లభించనుంది. 'జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్' పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే కేవలం ప్లాన్ ఛార్జీలు చెల్లిస్తే చాలు. హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితం.

ఇక జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడొచ్చు. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' పేరుతో జియో అందిస్తున్న మరో అద్భుతమైన సర్వీస్ ఇది. జియో గిగాఫైబర్ ప్రీమియం కస్టమర్లు... ఏ సినిమా ఎప్పుడు రిలీజైనా మీరు ఇంట్లోనే చూడొచ్చు. కేవలం ప్రీమియం కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. వచ్చే ఏడాదిలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. మరి మీరు కూడా జియో ఫైబర్ సేవలు పొందాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జియో ఫైబర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
Loading...
Android 10: ఆండ్రాయిడ్ 10 వచ్చేసింది... ఆకట్టుకునే ఫీచర్స్ ఇవే

Railways: భారతీయ రైల్వే ఎస్ఎంఎస్ సర్వీస్ గురించి మీకు తెలుసా?
First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...