JIO Phone offer: రూ.1500 విలువైన ఫోన్ రూ.699 ధరకే... 2జీ హ్యాండ్‌సెట్ మార్కెట్‌పై కన్నేసిన జియో

JIO Phone Diwali 2019 offer | రూ.1500 విలువైన జియోఫోన్‌ను కేవలం రూ.699 ధరకే అందిస్తోంది. ప్రస్తుతం 2జీ సేవలు పొందుతున్నవారంతా కేవలం రూ.699 చెల్లించడం ద్వారా 4జీ ప్రపంచంలోకి అడుగుపెట్టొచ్చు.

news18-telugu
Updated: October 7, 2019, 2:57 PM IST
JIO Phone offer: రూ.1500 విలువైన ఫోన్ రూ.699 ధరకే... 2జీ హ్యాండ్‌సెట్ మార్కెట్‌పై కన్నేసిన జియో
JIO Phone offer: రూ.1500 విలువైన ఫోన్ రూ.699 ధరకే... 2జీ హ్యాండ్‌సెట్ మార్కెట్‌పై కన్నేసిన జియో
news18-telugu
Updated: October 7, 2019, 2:57 PM IST
భారతీయ టెలికాం రంగంలో 4జీ టెక్నాలజీతో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు 2జీ మార్కెట్‌పై కన్నేసింది. ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో 35 కోట్ల‌కు పైగా ప్ర‌జ‌లు 2జీ నెట్‌వ‌ర్క్‌ను ఉపయోగిస్తున్నారు. వారికి స్మార్ట్‌ఫోన్ సేవ‌లు అందుబాటులో లేవు. తెలంగాణాలో ఇప్పటికీ 2 కోట్ల మంది ప్రజలు 2జీ నెట్‌వర్క్‌పై ఆధారపడుతున్నారు. వారి ముందు రెండే మార్గాలున్నాయి. డేటా సేవలపై ఆశలు వదిలేసుకోవడం లేదా అత్యంత ఎక్కువ ధరను చెల్లించడం. అయినా ఉచిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఇంటర్నెట్ సేవలూ అందట్లేదు. అందుకే రిలయన్స్ జియో మరో భారీ అడుగు వేస్తూ డిజిటల్ విప్లవంలో మరింత ముందుకు సాగుతోంది. దసరా, దీపావళి పండుగ సీజన్ సందర్భంగా 'జియో ఫోన్ దీపావళి 2019' పేరుతో ప్రత్యేకమైన ఆఫర్ అందిస్తోంది. రూ.1500 విలువైన జియోఫోన్‌ను కేవలం రూ.699 ధరకే అందిస్తోంది. ప్రస్తుతం 2జీ సేవలు పొందుతున్నవారంతా కేవలం రూ.699 చెల్లించడం ద్వారా 4జీ ప్రపంచంలోకి అడుగుపెట్టొచ్చు.

JIO Phone Diwali 2019 offer, JIO Phone Rs 699, JIO Diwali offer, Reliance Jio Diwali offer, JIO 4g phone, Reliance Jio offers, Reliance Jio sale, Reliance Jio discount, జియో ఫోన్ దివాళీ 2019 ఆఫర్, జియో ఫోన్ రూ.699 ఆఫర్, జియో దివాళీ ఆఫర్, రిలయెన్స్ జియో దివాళీ ఆఫర్, జియో 4జీ ఫోన్, రిలయెన్స్ జియో ఆఫర్స్, రిలయెన్స్ జియో సేల్, రిలయెన్స్ జియో డిస్కౌంట్
Source: Reliance Jio


రూ.1500 విలువైన జియోఫోన్‌ను రూ.699 ధరకే సొంతం చేసుకోవడం ద్వారా రూ.800 పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయాలన్న షరతులేవీ లేవు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న 2జీ ఫీచర్ ఫోన్లన్నింటితో పోలిస్తే ఇంత తక్కువ ధరకు లభిస్తున్న హ్యాండ్‌సెట్ జియో ఫోన్ ఒక్కటే. 2జీ యూజర్లు ఈ ఫోన్ కొని ఏకంగా శక్తివంతమైన 4జీ సేవల్ని పొందొచ్చు. రూ.700 లోపే 2జీ నుంచి 4జీ ప్రపంచంలోకి మారిపోవచ్చు. వినియోగదారులకు రూ.693 విలువైన అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి. 'జియో ఫోన్ దీపావళి 2019' ఆఫర్‌లో ఫోన్ కొంటే మొదటి 7 రీఛార్జ్‌లకు జియో రూ.99 చొప్పున డేటాను ఏడు నెలల పాటు ఉచితంగా అందిస్తుంది. అంటే 7 నెలల్లో రూ.693 విలువైన డేటా పొందొచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్, పేమెంట్స్, ఎడ్యుకేషన్, లెర్నింగ్, ట్రైన్ లేదా బస్ బుకింగ్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్... ఇలా ఇప్పటివరకు 2జీ యూజర్లు చూడలేని ప్రపంచాన్ని జియోఫోన్‌తో చూడొచ్చు.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ మరో సర్‌ప్రైజ్... దీపావళికి ముందే మరో సేల్
Loading...
Reliance Offers: రిలయెన్స్ డిజిటల్‌లో 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్'... కేజీ బంగారం గెలుచుకునే ఛాన్స్

Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్... ఆర్‌బీఐ కీలక నిర్ణయం
First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...