భారతదేశంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ దూకుడుగా 5జీ కవరేజీని పెంచుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని మరో 9 పట్టణాలకు జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవల్ని విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, భీమవరం, చీరాల, గుంతకల్, నంద్యాల, తెనాలి, తెలంగాణలోని ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రామగుండంలో జియో 5జీ సేవలు (Jio 5G Services) ప్రారంభం అయ్యాయి. ఒక్క రోజులోనే 9 పట్టణాల్లో జియో 5జీ సేవల్ని ప్రారంభించడం విశేషం. వీటితో పాటు దేశంలోని 34 పట్టణాల్లో జియో 5జీ సేవలు తాజాగా ప్రారంభం అయ్యాయి. దీంతో భారతదేశంలోని 225 పట్టణాలు, నగరాల్లో జియో 5జీ సేవలు లభిస్తున్నాయి.
ఇక ఇప్పటికే రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల, విశాఖపట్నం , విజయవాడ , గుంటూరు , తిరుపతి, నెల్లూరు , ఏలూరు, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, కడప , నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండలో జియో 5జీ సేవల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని 22, తెలంగాణలోని 9 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ విషయానికి వస్తే తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 8 నగరాల్లో మాత్రమే 5జీ లాంఛ్ చేసింది.
Mobile Apps: ఈ యాప్స్ చాలా డేంజర్... వెంటనే డిలిట్ చేయండి
మరో 34 నగరాల్లో జియో ట్రూ 5G సేవలను ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నాము. మొత్తం సంఖ్య 225 నగరాలకు చేరుకున్నాం. బీటా ట్రయల్ ప్రారంభించినప్పటి నుంచి కేవలం 120 రోజుల్లో జియో ఈ మైలురాయిని సాధించింది. డిసెంబర్ 2023 నాటికి జియో ట్రూ 5G సేవలతో దేశం మొత్తాన్ని కనెక్ట్ చేసే మార్గంలో ఉన్నాం. ఈ స్థాయి 5G నెట్‌వర్క్ రోల్‌అవుట్ ప్రపంచంలో జరగడం ఇదే మొదటిసారి. 2023 భారతదేశానికి ఒక మైలురాయి సంవత్సరం అవుతుంది. అప్పుడు దేశం మొత్తం జియో అత్యుత్తమ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా పంపిణీ చేయబడిన విప్లవాత్మక ట్రూ 5G సాంకేతికత ప్రయోజనాలను పొందుతుంది. మన దేశాన్ని డిజిటలైజ్ చేయాలనే మా తపనకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
జియో అధికారిక ప్రతినిధి
జియో ట్రూ 5జీ సేవల లాంఛింగ్ సందర్భంగా రిలయన్స్ జియో వెల్‌కమ్ ఆఫర్ అందిస్తోంది. జియో యూజర్లు ప్రస్తుతం ఉచితంగానే జియో 5జీ సేవల్ని వాడుకోవచ్చు. 1జీబీపీఎస్ వరకు స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. జియో యూజర్లు సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా జియో 5జీ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.
Train Tickets: ఈ ట్రిక్‌తో బుక్ చేస్తే ట్రైన్ టికెట్స్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
తమ స్మార్ట్‌ఫోన్‌లో జియో 5జీ ఉపయోగించలేకపోతున్నవారు మైజియో యాప్ ఓపెన్ చేసి ఇన్విటేషన్ వచ్చిందో లేదో చెక్ చేయాలి. ఇన్విటేషన్ ఉన్నా, పైన చెప్పిన సెట్టింగ్స్ మార్చినా మీరు 5జీ నెట్వర్క్ ఉపయోగించలేకపోతే ఓసారి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలి. ఈ కింది సెట్టింగ్స్ మార్చి జియో 5జీ నెట్వర్క్ వాడుకోవచ్చు.
ముందుగా ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత Mobile network లేదా సిమ్ కార్డ్‌కు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
అందులో Jio SIM పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Preferred network type ఆప్షన్ క్లిక్ చేయాలి.
3G,4G, 5G ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
మీరు 5G నెట్వర్క్ సెలెక్ట్ చేస్తే స్మార్ట్‌ఫోన్‌లో నెట్వర్క్ స్టేటస్ బార్‌లో 5G సింబల్ కనిపిస్తుంది.
మీరు జియో 5జీ నెట్వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు.
రిలయన్స్ జియో స్టాండలోన్ 5జీ నెట్వర్క్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అంటే జియో 5జీ నెట్వర్క్ 4జీ నెట్వర్క్‌పై ఆధారపడదు. అడ్వాన్స్‌డ్ 5జీ నెట్వర్క్ లభిస్తుంది. 5G కోసం రిలయన్స్ జియో దగ్గర 700MHz, 3500 MHz, 26 GHz బ్యాండ్‌లతో అతిపెద్ద, అత్యంత సముచితమైన వైర్‌లెస్ స్పెక్ట్రమ్ మిక్స్ ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Jio TRUE 5G, Reliance Jio