జియో సూపర్ స్పీడ్...మార్చిలో 4 జీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్ 22.4 ఎంబీపీఎస్

ట్రాయ్ వెలువరించిన గణాంకాల ప్రకారం 22.2 మెగా బైట్ పర్ సెకండ్ యావరేజీ డౌన్ లో‌డ్ స్పీడ్‌తో టాప్ స్థానంలో నిలిచింది. అదే సమయంలో అప్ లోడింగ్ స్పీడ్ లో వోడాఫోన్ మొదటి స్థానంలో నిలిచింది.

news18-telugu
Updated: April 22, 2019, 9:59 PM IST
జియో సూపర్ స్పీడ్...మార్చిలో 4 జీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్ 22.4 ఎంబీపీఎస్
ట్రాయ్ వెలువరించిన గణాంకాల ప్రకారం 22.2 మెగా బైట్ పర్ సెకండ్ యావరేజీ డౌన్ లో‌డ్ స్పీడ్‌తో టాప్ స్థానంలో నిలిచింది. అదే సమయంలో అప్ లోడింగ్ స్పీడ్ లో వోడాఫోన్ మొదటి స్థానంలో నిలిచింది.
  • Share this:
రిలయన్స్ జియో దేశంలోనే అత్యంత వేగవంతమైన డౌన్ లోడ్ స్పీడ్ కలిగి ఉన్న మొబైల్ నెట్ వర్క్ గా అవతరించింది. ట్రాయ్ వెలువరించిన గణాంకాల ప్రకారం 22.2 మెగా బైట్ పర్ సెకండ్ యావరేజీ డౌన్ లో‌డ్ స్పీడ్‌తో టాప్ స్థానంలో నిలిచింది. అదే సమయంలో అప్ లోడింగ్ స్పీడ్ లో వోడాఫోన్ మొదటి స్థానంలో నిలిచింది. మార్చి 2019 గణాంకాల ఆధారంగా వెలువడి ఈ ఫలితాల్లో జియో టాప్ డౌన్ లోడింగ్ స్పీడ్ తో మొదటి స్థానంలో నిలవగా, భారతీ ఎయిర్ టెల్ డేటా సగటు వేగం 9.3 ఎంబీపీఎస్ గా నమోదయ్యింది. అలాగే వోడాఫోన్, ఐడియా సంస్థలు విలీనమైనప్పటికీ, ట్రాయ్ ఇంకా విడివిడిగానే పెర్ఫార్మన్స్ ను పరిగణలోకి తీసుకుంటోంది. అయితే వోడాఫోన్, కొద్దిగా మెరుగుదల కనబరిచి 7 ఎంబీపీఎస్ డేటా సగటు వేగం కనబరిచింది. అదే సమయంలో ఐడియా మాత్రం 5.6 ఎంబీపీఎస్ వద్ద కొద్దిగా తక్కువ డేటా సగటు వేగాన్ని నమోదు చేసింది.

అప్ లోడింగ్ స్పీడ్ లో జియో 4.6 ఎంబీపీఎస్ యావరేజ్ స్పీడ్ నమోదు చేయగా, ఎయిర్ టెల్ 3.6 ఎంబీపీఎస్ యావరేజ్ స్పీడ్ నమోదు చేసింది. అయితే డౌన్ లోడ్ స్పీడ్ యూజర్లకు వీడియోలు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, మెయిల్స్ చెక్ చేసుకునేందుకు ఎక్కువగా దోహదపడుతుంది.  ఇదిలా ఉంటే ట్రాయ్ వెలువరిచిన ఈ గణాంకాలు మై స్పీడ్ అప్లికేషన్ ద్వారా సేకరించింది. మైస్పీడ్ యాప్ యాండ్రాయిడ్ ప్లే స్టోర్ లో లభ్యమవుతోంది. మై స్పీడ్ అప్లికేషన్ ఇప్పటికే పది లక్షల డౌన్లోడ్స్ పూర్తి చేసుకుంది.
First published: April 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading