Airtel vs Jio: ఎయిర్‌టెల్ ఆరోపణలను కొట్టిపారేసిన జియో

Airtel vs Jio | ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌తో సహా ఇతర టెలికామ్ కంపెనీలు పాటిస్తున్న ప్రమాణాలు కాకుండా రిలయెన్స్ జియో ఇతర అకౌంటింగ్ పద్ధతులు పాటిస్తుండటం వల్లనే నెట్‌వర్క్ కాస్ట్ తక్కువగా ఉందన్నది ఎయిర్‌టెల్ ఆరోపణ.

news18-telugu
Updated: September 26, 2019, 12:55 PM IST
Airtel vs Jio: ఎయిర్‌టెల్ ఆరోపణలను కొట్టిపారేసిన జియో
Airtel vs Jio: ఎయిర్‌టెల్ ఆరోపణలను కొట్టిపారేసిన జియో
news18-telugu
Updated: September 26, 2019, 12:55 PM IST
తప్పుడు అకౌంటింగ్ పద్ధతులు పాటించడం వల్ల రిలయెన్స్ జియో 4జీ నెట్‌వర్క్ ధరలు తక్కువగా ఉన్నాయంటూ భారతీ ఎయిర్‌టెల్ చేసిన ఆరోపణల్ని రిలయెన్స్ జియో ఖండించింది. VoLTE టెక్నాలజీతో తమకు యూజర్లు పెరిగారు తప్ప తప్పుడు అకౌంటింగ్ పద్ధతుల వల్ల కాదని రిలయెన్స్ జియో సీనియర్ ఎగ్జిక్యూటీవ్ తెలిపారంటూ ది ఎకనమిక్ టైమ్స్ కథనం పబ్లిష్ చేసింది. "వాయిస్ కాల్‌కు అకౌంటింగ్ ప్రమాణాలతో ఏమాత్రం సంబంధం లేదు. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని రిలయెన్స్ జియో పాటిస్తోంది. తాము ఇతర అకౌంటింగ్ పద్ధతుల్ని పాటిస్తున్నామని ఆరోపించడం పచ్చి అబద్ధం. భారతదేశమంతా వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ(VoLTE) టెక్నాలజీ ఉపయోగిస్తున్నందున మా 4జీ నెట్‌వర్క్ కాస్ట్ తక్కువగా ఉంటోంది" అని ఎకనమిక్ టైమ్స్‌తో రిలయెన్స్ జియో సీనియర్ ఎగ్జిక్యూటీవ్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌తో సహా ఇతర టెలికామ్ కంపెనీలు పాటిస్తున్న ప్రమాణాలు కాకుండా రిలయెన్స్ జియో ఇతర అకౌంటింగ్ పద్ధతులు పాటిస్తుండటం వల్లనే నెట్‌వర్క్ కాస్ట్ తక్కువగా ఉందన్నది ఎయిర్‌టెల్ ఆరోపణ. "ఇతర ఆపరేటర్లతో పోలిస్తే జియో పాటిస్తున్న అకౌంటింగ్ పద్ధతులకు చాలా తేడాలున్నాయి" అని ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటీవ్ కూడా ఎకనమిక్ టైమ్స్‌తో అన్నారు. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI లెక్కలు చూస్తే రిలయెన్స్ జియోకు 100% VoLTE కాల్స్ ఉండగా, ఎయిర్‌టెల్‌కు 18%, వొడాఫోన్ ఐడియాకు 5% మాత్రమే VoLTE ట్రాఫిక్ ఉంటోంది.

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Redmi offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రెడ్‌మీ ఫోన్లపై ఆఫర్లు ఇవే...

Smartphone: టాయిలెట్‌లో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా... ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే
Loading...
Realme Offers: ఫెస్టివల్ సేల్‌లో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే
First published: September 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...