Khelo Cricket Jio Cricket: ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం జియో క్రికెట్ కాంటెస్ట్‌... వివరాలు ఇవే

Khelo Cricket Jio Cricket- IPL 2019 Contest | బాల్ బాల్‌కీ ఏం జరుగుతుందో గెస్ చేసి MyJio App యాప్‌లో సమాధానాలు చెప్పాలి. సరైన సమాధానానికి పాయింట్స్ లభిస్తాయి. దాంతో పాటు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు చెప్పి పాయింట్స్ పెంచుకోవచ్చు.

news18-telugu
Updated: April 21, 2019, 1:59 PM IST
Khelo Cricket Jio Cricket: ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం జియో క్రికెట్ కాంటెస్ట్‌... వివరాలు ఇవే
Khelo Cricket Jio Cricket: ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం జియో క్రికెట్ కాంటెస్ట్‌... వివరాలు ఇవే (image: Jio)
  • Share this:
ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL... ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచడం మాత్రమే కాదు... విజేతల్ని కూడా చేస్తోంది. అనేక సంస్థలు క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆఫర్లు ఇస్తున్నాయి. పోటీలు నిర్వహిస్తున్నాయి. రిలయెన్స్ జియో కూడా ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఖేలో క్రికెట్ జియో క్రికెట్ పేరుతో కాంటెస్ట్ నిర్వహిస్తోంది. గతేడాది నిర్వహించిన ఈ కాంటెస్ట్‌లో ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ ప్రాంతానికి చెందిన గౌరవ్ కుమార్ 'ఖేలో క్రికెట్ జియో క్రికెట్' గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ముంబైలోని లోధాలో 1BHK లగ్జరీ ఫ్లాట్ సొంతం చేసుకున్నాడు. ఇటీవలే ఓ ఈవెంట్‌లో గౌరవ్ కుమార్ కుటుంబసభ్యులకు ఇంటి తాళం చెవులు అందించింది రిలయెన్స్ జియో.

Read this: JIO DND Feature: జియో యాప్‌లో డీఎన్‌డీ ఫీచర్ ఇలా యాక్టివేట్ చేయాలి


Khelo Cricket Jio Cricket: ఈ కాంటెస్ట్‌లో మీరూ పాల్గొనొచ్చు ఇలా...


2019 మార్చి 23న ప్రారంభమైన ఖేలో క్రికెట్ జియో క్రికెట్ కాంటెస్ట్‌లో మీరూ పాల్గొనొచ్చు. ఈ కాంటెస్ట్ మే 5న ముగుస్తుంది. క్రికెట్ మ్యాచ్ జరిగే సమయంలో ఈ కాంటెస్ట్ ఉంటుంది. బాల్ బాల్‌కీ ఏం జరుగుతుందో గెస్ చేసి MyJio App యాప్‌లో సమాధానాలు చెప్పాలి. సరైన సమాధానానికి పాయింట్స్ లభిస్తాయి. దాంతో పాటు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు చెప్పి పాయింట్స్ పెంచుకోవచ్చు. పాయింట్స్ ఎంత ఎక్కువ వస్తే ప్రైజ్ గెలిచే అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి. మీరూ ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలంటే ప్లేస్టోర్ లేదా యాప్‌స్టోర్‌లో MyJio app డౌన్‌లోడ్ చేసుకోవాలి. 'ఖేలో క్రికెట్ జియో క్రికెట్' కాంటెస్ట్‌ గురించి మరింత తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు
ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు

FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
Published by: Santhosh Kumar S
First published: April 21, 2019, 1:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading