హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio: తెలంగాణలో 52వ జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న జియో

Jio: తెలంగాణలో 52వ జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న జియో

Jio: తెలంగాణలో 52వ జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న జియో

Jio: తెలంగాణలో 52వ జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న జియో

National Safety Week | తెలంగాణలో రిలయన్స్ జియో (Reliance Jio) 52వ జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తోంది. మార్చి 10 వరకు వారోత్సవాలు జరగనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ జియో, తెలంగాణ రాష్ట్రంలోని తన కార్యాలయాల్లో 52వ జాతీయ భద్రతా వారోత్సవాలను జరుపుకుంటోంది. తన ఉద్యోగులు, కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో జియో మార్చి 4 నుండి 10 వరకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఏడాది పొడవునా సురక్షితంగా పని చేయాలనే నిబద్ధతను పునరుద్ధరించడం, వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత (OH&S) పై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం. సేఫ్టీ వీక్‌లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పని ప్రదేశాలలో వివిధ భద్రతా అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యకలాపాలలో కార్మికులకు నిర్మాణ సామగ్రి, యంత్రాలు, పరికరాలను సురక్షితంగా నిర్వహించడంపై ప్రత్యేక ప్రదర్శన సెషన్‌లు, మాక్-డ్రిల్ శిక్షణ ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జియో తెలంగాణ బృందం సభ్యులు పని ప్రదేశాలలో ప్రమాదాలు, ప్రమాదాలను నివారించడానికి అనుసరించాల్సిన భద్రతా ప్రోటోకాల్‌లపై అవగాహన, నిబద్ధతను పెంచడానికి ప్రతిజ్ఞ చేశారు.

Jio Plan: అదనంగా 87 జీబీ డేటా, 23 రోజుల వేలిడిటీ... జియో నుంచి స్పెషల్ ప్లాన్

Reliance Jio, 52nd National Safety Week, Reliance Jio National Safety Week, Jio National Safety Week, national safety day theme 2023, national safety week 2023, safety week celebration, జాతీయ భద్రతా వారోత్సవాలు, జియో జాతీయ భద్రతా వారోత్సవాలు, రిలయన్స్ జియో జాతీయ భద్రతా వారోత్సవాలు, రిలయన్స్ జియో

కట్టుదిట్టమైన భద్రతా నియమాలు, నియంత్రణ చర్యలను అమలు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం భద్రతా థీమ్ ”OUR AIM- ZERO HARM" ని స్వాగతించడానికి, ఆచరణలో పెట్టడానికి JIO- తెలంగాణ అత్యంత ఉత్సాహంతో ముందుకు వచ్చింది. JIO యొక్క లక్ష్యాలలో ఒకటి కార్మికులను భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రేరేపించడం, ఉద్యోగుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని సృష్టించడం.

Aadhaar Name Update: ఆధార్ కార్డుపై పేరు మార్చాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి

అంతేకాకుండా, నెట్‌వర్క్, ఆపరేషన్, మెయింటెనెన్స్, హెచ్‌ఎస్‌ఇ సభ్యుల ప్రసంగాలతో భద్రతా అవగాహన సెషన్‌లు, జెండా వందనాలు, భద్రతా ప్రతిజ్ఞ, భద్రతా బ్యాడ్జ్, బ్యానర్, పోస్టర్ ప్రదర్శన, భద్రతా అవగాహన పై ర్యాలీ‌లు కూడా నిర్వహించబడుతున్నాయి.

First published:

Tags: Jio, Reliance Jio

ఉత్తమ కథలు