భారత టెలికాం రంగంలో అనేక సంచలనాలు సృష్టించిన రిలయెన్స్ జియో ఖాతాలో ఇప్పుడు మరో రికార్డ్ చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్‌లో ఒకటిగా రిలయెన్స్ జియో నిలిచింది. యాపిల్, అమెజాన్, డిస్నీ, టెన్సెంట్, అలీబాబా లాంటి దిగ్గజ కంపెనీలన్నింటినీ వెనక్కి నెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా బలమైన బ్రాండ్స్‌లో రిలయెన్స్ జియో 5వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్‌లో రిలయెన్స్ జియోకు ఈ ఘనత దక్కింది. మొదటి స్థాంలో వీచాట్ ఉంటే, రెండో స్థానంలో ఫెరారీ ఉంది. ఇక మూడో స్థానంలో రష్యాకు చెందిన Sber బ్యాంకు ఉండగా, సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కోకా కోలా నాలుగో స్థానంలో ఉంది. ఇక భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయెన్స్ జియో ఐదో స్థానంలో ఉండటం విశేషం.
మొదటిసారి ర్యాంకింగ్‌లోకి అడుగుపెట్టిన భారతీయ టెలికాం దిగ్గజం రిలయెన్స్ జియో 100 కు 91.7 బీఎస్ఐ స్కోర్‌తో ప్రపంచంలోనే 5వ స్ట్రాంగెస్ట్ బ్రాండ్‌గా నిలిచింది. AAA+ బ్రాండ్ స్ట్రెంత్ రేటింగ్ సంపాదించింది. 2016లో ఏర్పాటైన జియో 40 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో భారతదేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా స్థానం సంపాదించుకుంది. సరసరమైన ధరలకే ప్లాన్స్ అందించడంతో పాటు, యూజర్లకు ఉచితంగా 4జీ డేటా అందించడం ద్వారా తుఫాను సృష్టించింది.
— బ్రాండ్ వ్యాల్యుయేషన్ కన్సల్టెన్సీ బ్రాండ్ ఫైనాన్స్ ప్రకటన
బ్రాండ్ ఫైనాన్స్ మార్కెట్ రీసెర్చ్ ద్వారా ర్యాంకింగ్ ఇచ్చిందని భారతదేశంలోని ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే ఇన్నోవేషన్, వ్యాల్యూఫర్ మనీ, కస్టమర్ సర్వీస్ లాంటి అనేక కొలమానాల్లో జియో అత్యధికంగా స్కోర్ చేసిందని, ఈ రంగంలో జియోకు ఎలాంటి ప్రధానమైన బలహీనత కనిపించలేదని బ్రాండ్ ఫైనాన్స్ కొనియాడింది.
బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్‌లో టాప్ 25లో జియో తర్వాత డెలాయిట్, లీగో, అమెజాన్, డిస్నీ, అలీ బాబా, యాపిల్, పెప్సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాంటి కంపెనీలున్నాయి. ఇండియా నుంచి టాప్ 25 లో రిలయెన్స్ జియో 5వ స్థానంలో ఉంటే 25వ స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉండటం విశేషం.