హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio 5G: జియో సిమ్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఇక ఈ ప్రాంతాల్లో కూడా 5జీ సేవలు!

Jio 5G: జియో సిమ్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఇక ఈ ప్రాంతాల్లో కూడా 5జీ సేవలు!

Jio 5G: జియో సిమ్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఇక ఈ ప్రాంతాల్లో కూడా 5జీ సేవలు!

Jio 5G: జియో సిమ్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఇక ఈ ప్రాంతాల్లో కూడా 5జీ సేవలు!

Akash Ambani | రిలయన్స్ జియో తన 5జీ సర్వీసులను మరింత విస్తరించింది. ముకేశ్ అంబానీ కుమారుడు, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తాజాగా రాజస్థాన్‌లో కూడా 5జీ సర్వీసులను ప్రారంభించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Reliance Jio 5G | దేశంలోని దిగ్గజ టెలికం కంపెనీ రిలయన్స్ జియో (Jio) తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. 5జీ సేవలను (5G Services) విస్తరించింది. దీంతో మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తాజాగా రాజస్థాన్‌లో 5జీ సేవలు ఆవిష్కరించారు. రాజ్‌సమంద్‌ నాథ్‌ద్వారా ప్రసిద్ధ దేవాలయం శ్రీనాథ్‌జీ దేవాలయంలో ఆకాశ్ అంబానీ 5జీ సర్వీసులు ప్రారంభించారు. రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశ్ అంబానీ చేసిన తొలి కీలక ప్రకటన ఇదే అని చెప్పుకోవచ్చు.

ఆకాశ్ అంబానీ శనివారం ఉదయం స్పెషల్ ఫ్లైట్‌లో ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి నాథ్‌ద్వారా వెళ్లారు. అక్కడ 5జీ సర్వీసులు ప్రారంభించారు. అంబానీ కుటుంబానికి శ్రీనాథ్‌జీ ఆరాధ్య దైవంగా చెప్పుకోవచ్చు. శ్రీనాథ్‌జీపై అంబానీలకు అపారమైన నమ్మకం ఉంది. ఇంతకుముందు కూడా రిలయన్స్ జియో 4జీ సేవలను కూడా ఈ ఆలయం నుంచే ప్రారంభించారు. ఇప్పుడు 5జీ సేవలను కూడా ఆవిష్కరించారు.

ఎస్‌బీఐ సర్‌ప్రైజ్.. దీపావళి ముందు కస్టమర్లకు అదిరే శుభవార్త!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, అపర కుబేరుల్లో ఒకటైన ముకేశ్ అంబానీ కూడా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ దేవాలయాన్ని సందర్శించారు. అప్పుడు ఈయన మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో నాథ్‌ద్వారా నుంచే 5జీ సర్వీసులను ప్రారంభిస్తామని తెలియజేశారు. ఇప్పుడు ఆకాశ్ అంబానీ ఇలానే చేశారు. 5జీ సర్వీసులు ప్రారంభించారు. దీంతో అక్కడ కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చ.

రూ.లక్ష పెట్టుబడితో రూ.14 లక్షల లాభం.. 29 పైసల షేరుతో డబ్బే డబ్బు!

కాగా దేశంలో అక్టోబర్ 1 నుంచే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దేశవ్యాప్తంగా ఈ సర్వీసులు అందుబాటులోకి రావాలంటే ఇంకా 3 నుంచి మూడేళ్ల వరకు పట్టొచ్చు. ఇప్పుడు కేవలం ఎంపిక చేసిన పట్ణణాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. జియో పలు ప్రాంతాల్లో 5జీ సేవలు అందిస్తోంది.

జియో కస్టమర్లు ఢిల్లీ , ముంబై, కోల్‌కతా, వారణాసిలో 5జీ సేవలు పొందొచ్చు. అయితే 5జీ సర్వీసులు పొందాలంటే కచ్చితంగా 5జీ ఫోన్ ఉండాల్సిందే. 4జీ సిమ్ కలిగిన వారికి కూడా 5జీ సర్వీసులు వస్తాయి. ప్రత్యేకంగా 5జీ సిమ్ తీసుకోవాల్సిన పని లేదు. మీ వద్ద 5జీ ఫోన్ ఉంటే.. మీరు ఆటోమేటిక్‌గానే జియో 5జీ వెల్‌కమ్ ఆఫర్ పొందొచ్చు. ఇందులో భాగంగా జియో కస్టమర్లు 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అపరిమిత 5జీ సేవలు పొందొచ్చు. అయితే ఈ ఫెసిలిటీ రూ. 239 లేదా ఎక్కువ రీచార్జ్ ప్లాన్ కలిగిన వారికే వర్తిస్తుంది.

First published:

Tags: 5G, Akash Ambani, Jio, Jio 5G, Reliance Jio