కరోనా కారణంగా ఈ ఏడాది కూడా హిమాలయాల్లోని అమర్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం దక్కలేదు. దీంతో చాలామంది టీవీల్లోనే అమర్‌నాథ్‌లో జరుగుతున్న పూజాలు చూస్తున్నారు. అయితే తాజాగా అమర్‌నాథ్ వెళ్లి మంచు లింగాన్ని దర్శించుకోలేని వారికి రిలయన్స్ జియో ఓ మంచి అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా భక్తులు తాము ఉన్న చోటి నుంచే అమర్‌నాథ్‌లో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం జియో టీవీలో ప్రత్యేకంగా శ్రీ అనే ఛానల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇక జియో మీట్ ద్వారా వర్చువల్‌గా పూజలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. భక్తుల తమ గోత్రనామాలతో ఉన్న చోటి నుంచే పూజలో పాల్గొనవచ్చు. జియో సావన్‌లో ఛలో అమర్‌నాథ్ పేరుతో ప్రత్యేక గీతాలు, భజనలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక జియో ఛాట్ ద్వారా అమర్‌నాథ్‌లో దర్శనాలు, హారతి సమయాలు ఇతర విషయాలకు సంబంధించిన సమాధానం అందిస్తోంది.
అమర్‌నాథ్‌లో ఉండే ప్రతికూల పరిస్థితులను తట్టుకుని హారతి సహా వివిధ సేవలను లైవ్‌లో అందించేందుకు కావాల్సిన పరికరాలను, టెక్నాలజీని జియో అక్కడ ఏర్పాటు చేసింది. జియో టీవీలో అమర్‌నాథ్ హారతి, దర్శనం కోసం శ్రీ అమర్‌నాథ్ జీ షైన్ బోర్డులోకి వెళ్లాలి. లైవ్‌తో పాటు రికార్డింగ్‌ను కూడా ఇందులో వీక్షించవచ్చు. హారతి కార్యక్రమం ఉదయం 6 నుంచి 6,30 గంటలు, సాయంత్రం 5 నుంచి 5,30 గంటల సమయంలో చూడొచ్చు.
అక్కడ వర్చువల్‌గా పూజలో పాల్గొనేందుకు బోర్డుకు సంబంధించిన వెబ్‌సైట్ www.shriamarnathjishrine.com లేదా బోర్డు మొబైల్ యాప్‌ను సందర్శించాలి. ఇందులో బుకింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత వర్చువల్ పూజలో పాల్గొనేందుకు జియో మీట్ లింక్ వారికి వస్తుంది. దీని ద్వారా భక్తులు పూజలో పాల్గొనవచ్చు. ఇక జియో సావన్‌లో అమర్‌నాథ్‌కు సంబంధించిన పాటలతో పాటు శివ భగవానుడి పాటు, భజనలు ఉన్నాయి. జియో టీవీ సేవలను పొందలేని వాళ్లు జియో ఛాట్ ద్వారా అమర్‌నాథ్ యాత్ర, దర్శనాలు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amarnath Yatra, Jio