Home /News /technology /

RELIANCE JIO BECOMES NUMBER 1 AGAIN IN GAINING USERS HERE DETAILS NS

Reliance Jio: మరోసారి దుమ్ములేపిన జియో.. భారీగా కొత్త కస్టమర్లు.. ఎన్ని లక్షలంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిలయన్స్ జియో మరో సారి తన సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల్లో మరో సారి నంబర్.1గా నిలిచింది జియో. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    రిలయన్స్ జియో (Reliance Jio) మరో సారి తన సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల్లో మరో సారి నంబర్.1గా నిలిచింది జియో. టెలికాం రెగ్యులేటరీ సంస్థ TRAI విడుదల చేసిన తాజా సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం.. మే 2022 నెలకు గాను రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్లను చేర్చుకుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలయన్స్ జియో అత్యధికంగా 3,27,020 మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను పొందడం విశేషం. ఇతర పోటీ టెలికాం సంస్థలను పరిశీలిస్తే.. ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్ 71,312 నూతన చందాదారులను చేర్చుకుంది. మరో టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా 74,808 మంది వినియోగదారులను కోల్పోయింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL విషయానికి వస్తే సంస్థ మరో 78,423 మంది వినియోగదారులను దూరం చేసుకుంది. జాతీయ స్థాయి లెక్కల విషయానికి వస్తే.. రిలయన్స్ జియో మే నెలలో 31.11 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను సంపాధించుకుంది.

    తద్వారా.. భారతీయ టెలికాం మార్కెట్లో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. ఫలితంగా.. దేశవ్యాప్తంగా జియో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య ప్రస్తుతం 40.87 కోట్లకు చేరుకోవడం విశేషం. భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 10.27 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది.
    HP Smart SIM Laptop: రిలయన్స్ డిజిటల్‌లో హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ ఆఫర్... 100జీబీ డేటా ఉచితం


    దీంతో సంస్థ మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. మరో వైపు, వోడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య ఈ నెలలో 7.59 లక్షలు తగ్గడంతో 25.84 కోట్లకు పడిపోయింది. BSNL వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గిడంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 11.28 కోట్లకు పడిపోయింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Jio

    తదుపరి వార్తలు