మీరు రిలయెన్స్ జియో యూజరా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. రిలయెన్స్ జియో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. మార్చి 31 వరకు ఈ పరిస్థితి తప్పదు. ఆ తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేం. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులు ఇళ్లలోంచే పనిచేస్తున్నారు. ఇంటి దగ్గర్నుంచి పనిచేస్తున్నప్పుడు డేటా ఎక్కువగా ఉపయోగించడం మామూలే. అందుకోసమే రిలయెన్స్ జియో తమ కస్టమర్లు విధుల్లో ఇబ్బంది పడకూడదని ఈ ప్లాన్ ప్రకటించింది.
రిలయెన్స్ జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ ధర రూ.251. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి 51 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు. ఒకవేళ కస్టమర్ ఒక రోజులో 2 జీబీ కన్నా ఎక్కువ వాడితే ఆ తర్వాత 64 కేబీపీఎస్‌తో డేటా వాడుకోవచ్చు. ఈ డేటాకు లిమిట్ లేదు. ఎంతైనా వాడుకోవచ్చు. కానీ స్పీడ్ తక్కువ ఉంటుంది. ఇప్పటికే రిలయెన్స్ జియో 4జీ డేటా ఎక్స్‌టెన్షన్ ప్లాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్స్‌తో ఎలాంటి లాభాలుంటాయో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
March 31 Deadline: ఈ 6 పనులకు మార్చి 31 చివరి తేదీ... వివరాలివే
4G Data: రోజూ 2జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే
Pan Card: పాన్ కార్డ్ కావాలా? 10 నిమిషాల్లో ఫ్రీగా తీసుకోండి ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Jio, Reliance Jio