Reliance Jio: రూ.100 లోపు జియో నుంచి మరో రెండు రీఛార్జ్ ప్లాన్స్

Reliance Jio Recharge Plans | రిలయెన్స్ జియో నుంచి మరో రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చాయి. రూ.49, రూ.69 రీఛార్జ్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి.

news18-telugu
Updated: February 25, 2020, 2:46 PM IST
Reliance Jio: రూ.100 లోపు జియో నుంచి మరో రెండు రీఛార్జ్ ప్లాన్స్
Reliance Jio: రూ.100 లోపు జియో నుంచి మరో రెండు రీఛార్జ్ ప్లాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిలయెన్స్ జియో యూజర్లకు శుభవార్త. అతి తక్కువ ధరకే రెండు రీఛార్జ్ ప్లాన్స్‌ని ప్రకటించింది రిలయెన్స్ జియో. రూ.100 లోపే ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. షార్టర్ వేలిడిటీ ప్లాన్స్ కేటగిరీలో రూ.49, రూ.69 ప్లాన్స్‌ని తీసుకొచ్చింది. రూ.49 రీఛార్జ్ చేస్తే 14 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ డేటా మొత్తం వాడుకున్న తర్వాత 64 కేబీపీఎస్‌తో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియోకు 250 నిమిషాలు లభిస్తాయి. 25 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. రూ.69 రీఛార్జ్ చేసుకున్నవారికీ ఇవే బెనిఫిట్స్ లభిస్తాయి. డేటా 7 జీబీ లభిస్తుంది.

ఇక ఇప్పటికే రిలయెన్స్ జియో సరికొత్త లాంగ్ టర్మ్ వేలిడిటీ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2,121 రీఛార్జ్ చేసినవారికి 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 504 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు. ఒక రోజులో 1.5 జీబీ డేటా పూర్తిగా వాడేస్తే ఆ తర్వాత 64 కేబీపీఎస్‌‌తో అన్‌లిమిడెట్ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 12,000 నిమిషాలు లభిస్తాయి. ఇక రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీటితో పాటు జియో యాప్స్ అన్నింటికీ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Gold Discount: బంగారంపై రూ.6,000 డిస్కౌంట్... కొనండి ఇలా

Realme X50 Pro 5G: తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ' ఎలా ఉందో చూడండి

Redmi Note 8 Pro: గుడ్ న్యూస్... రెడ్‌మీ నోట్ 8 ప్రో ధర తగ్గింది
Published by: Santhosh Kumar S
First published: February 25, 2020, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading