Reliance Jio: రిలయెన్స్ జియో సరికొత్త ప్లాన్... ఒకసారి రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ

Reliance Jio Rs 2121 plan | రిలయెన్స్ జియో నుంచి మరో సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి దాదాపు ఏడాది వేలిడిటీ లభిస్తుంది.

news18-telugu
Updated: February 24, 2020, 12:01 PM IST
Reliance Jio: రిలయెన్స్ జియో సరికొత్త ప్లాన్... ఒకసారి రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ
Reliance Jio: రిలయెన్స్ జియో సరికొత్త ప్లాన్... ఒకసారి రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు రిలయెన్స్ జియో నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్ ప్రకటించింది రిలయెన్స్ జియో. ప్రతీ నెల లేదా మూడు నెలలకోసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకసారి రీఛార్జ్ చేస్తే 336 రోజుల లాంగ్ టర్మ్ వేలిడిటీ అందించే రీఛార్జ్ ప్లాన్ ఇది. అంటే దాదాపు ఏడాది పాటు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. రిలయెన్స్ జియో వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఈ ప్లాన్ ధర రూ.2,121. రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 504 జీబీ 4జీ డేటా పొందొచ్చు. ఒక రోజులో 1.5 జీబీ డేటా పూర్తిగా వాడేస్తే ఆ తర్వాత 64 కేబీపీఎస్‌‌తో అన్‌లిమిడెట్ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 12,000 నిమిషాలు లభిస్తాయి. ఇక రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీటితో పాటు జియో యాప్స్ అన్నింటికీ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

ఇక రిలయెన్స్ జియోలో రోజుకు 1.5 జీబీ డేటా అందించే మరో మూడు ప్లాన్స్ ఉన్నాయి. రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 42 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 1,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

రూ.399 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 84 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 2,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

రూ.555 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 126 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 3,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Jio Plans: జియోలో ఎక్కువ డేటా కావాలా? రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Reliance Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాలు కావాలా? ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండిSIM Swap: మీ బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేసే మోసాన్ని అడ్డుకోండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: February 24, 2020, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading