'ఒప్పో మాన్సూన్ ఆఫర్' ప్రకటించిన రిలయెన్స్ జియో!

3.2 టెరాబైట్ 4జీ డేటా, రూ.4,900 అదనపు ప్రయోజనాలతో రిలయెన్స్ జియో 'ఒప్పో మాన్సూన్ ఆఫర్' ప్రకటించింది.

news18-telugu
Updated: June 29, 2018, 11:19 AM IST
'ఒప్పో మాన్సూన్ ఆఫర్' ప్రకటించిన రిలయెన్స్ జియో!
రిలయెన్స్ జియో
  • Share this:
వర్షాకాలంలో ఆఫర్ల వర్షం కురిపిస్తోంది రిలయెన్స్ జియో. ఏకంగా 3.2 టెరాబైట్ 4జీ డేటా, రూ.4,900 విలువైన మరిన్ని ప్రయోజనాలతో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 'జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్' కింద ఈ లాభాలను కస్టమర్లు పొందొచ్చు.

ఆఫర్ ఎలా పనిచేస్తుంది?
జియో సబ్‌స్క్రైబర్ కొత్త ఒప్పో డివైస్ కొనాలి. పాత లేదా కొత్త జియో సిమ్‌పై ఈ ఆఫర్ పొందొచ్చు. రూ.1,800(రూ.50 విలువైన 36ఓచర్లు) తక్షణమే పొందొచ్చు. వీటితో పాటు జియో సిమ్‌ కార్డులపై 13, 26, 39వ రీఛార్జ్‌ల తర్వాత రూ.600 చొప్పున మూడు విడతల్లో రూ.1,800 క్రెడిట్ చేస్తారు. రూ.1,300 విలువైన మేక్ మై ట్రిప్ డిస్కౌంట్ ఓచర్లు లభిస్తాయి. ఈ ఆఫర్ 28 జూన్, 2018 నుంచి మొదలవుతుంది. రూ.198, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్స్‌పైన మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజూ 4.5 జీబీ డేటాతో రూ.299 ప్లాన్‌ను గతవారం ప్రకటించింది జియో. అయితే ఈ ఆఫర్ జూన్ 20 వరకే అందుబాటులో ఉంచింది. అంతకుముందు రూ.299 ప్లాన్‌పై రోజూ 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ మాత్రమే వచ్చేవి.

First published: June 29, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు