హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioPostpaid Plus: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

JioPostpaid Plus: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

JioPostpaid Plus: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

JioPostpaid Plus: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

JioPostpaid Plus | పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి రిలయెన్స్ జియో అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌ ధన్ ధనా ధన్‌ ద్వారా ఏఏ ఆఫర్స్ పొందొచ్చో తెలుసుకోండి.

రిలయెన్స్ జియో మరో అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌ ధన్ ధనా ధన్‌ను ప్రకటించింది. కనెక్టివిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఎక్స్‌పీరియెన్స్‌లో జియోపోస్ట్‌పెయిడ్ యూజర్లకు సుపీరియర్ సేవలు లభించనున్నాయి. జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌లో కస్టమర్లకు అనేక అద్భుతమైన సేవలు లభించనున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 650పైగా లైవ్ టీవీ ఛానెల్స్, వీడియో కంటెంట్, 5 కోట్ల పాటలు, 300 పైగా న్యూస్ పేపర్స్‌తో పాటు జియో యాప్స్ ఉచితంగా వాడుకోవచ్చు. ఇక ఫీచర్స్ ప్లస్‌లో భాగంగా మొత్తం కుటుంబానికి ఒకరికి రూ.250 చొప్పున ఫ్యామిలీ ప్లాన్ తీసుకోవచ్చు. డేటా రోల్ ఓవర్ 500 జీబీ వరకు లభిస్తుంది. ఇక ఇండియాలో, విదేశాలకు వైఫై కాలింగ్ ఉచితం. ఇక ఇంటర్నేషనల్ ప్లస్ సేవల్లో భాగంగా విదేశాలకు వెళ్లే భారతీయులకు మొదటిసారిగా ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీ లభిస్తుంది. యూఎస్ఏ, యూఏఈ దేశాలకు ఉచితంగా ఇంటర్నేషనల్ రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. కేవలం ఒక్క రూపాయికే ఇండియా కాలింగ్ పేరుతో వైఫై కాలింగ్ ద్వారా ఇంటర్నేషనల్ రోమింగ్ సర్వీస్‌ పొందొచ్చు. ఐఎస్‌డీ కాల్స్ నిమిషానికి 50 పైసలు మాత్రమే. ఇక ఎక్స్‌పీరియెన్స్ ప్లస్ ద్వారా ప్రస్తుతం జియోలో క్రెడిట్ లిమిట్ కొనసాగించొచ్చు. మీ నెంబర్ మార్చకుండా పోస్ట్‌పెయిడ్‌కు మారొచ్చు. ఉచితంగా హోమ్ డెలివరీ, యాక్టివేషన్ లాంటి సేవలున్నాయి. జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌ కస్టమర్లకు ప్రీమియం కాల్ సెంటర్ సర్వీస్ లభిస్తుంది. జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభం అవుతాయి.

Poco X3: ఇండియాలో రిలీజైన పోకో ఎక్స్3... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే

JioBrowser: మేడ్ ఇన్ ఇండియా జియోబ్రౌజర్ వచ్చేసింది... ఫీచర్స్ ఇవే

జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌ను పరిచయం చేయడానికి ఇదే సరైన సమయం. ప్రీపెయిడ్ విభాగంలో ఇప్పటికే 40 కోట్ల మంది కస్టమర్ల విశ్వాసాన్ని పొందాము. ఇప్పుడు పోస్ట్‌పెయిడ్ కేటగిరీపై దృష్టిపెట్టాం. ప్రతీ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌ను దృష్టిలో పెట్టుకొని జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌ను రూపొందించాం. హైక్వాలిటీ కనెక్టివిటీ, అంతులోని ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్, చవక ధరలో ఇంటర్నేషనల్ రోమింగ్, నూతనంగా ఆవిష్కరించిన ఫీచర్స్, అన్నింటికంటే ముఖ్యంగా కస్టమర్లకు మంచి ఎక్స్‌పీరియెన్స్ అందిస్తాం. గోల్డ్ స్టాండర్డ్ సర్వీస్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తాం. భారతదేశంలో ప్రతీ పోస్ట్‌పెయిడ్ యూజర్ వాటిని ఉపయోగిస్తారని భావిస్తున్నాం.

ఆకాశ్ అంబానీ, డైరెక్టర్, జియో

' isDesktop="true" id="611846" youtubeid="vIkLA6VDgEE" category="technology">

JioPostpaid Plus Rs 399: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ రూ.399 ప్లాన్ ఎంచుకుంటే 75జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్, ఎస్ఎంఎస్ కాల్స్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 200జీబీ డేటా రోల్ ఓవర్ ఉంటుంది. అంటే మీరు గతంలో ఉపయోగించని 200జీబీ డేటాను మరుసటి నెలలో ఉపయోగించుకోవచ్చు.

JioPostpaid Plus Rs 599: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ రూ.599 ప్లాన్ ఎంచుకుంటే 100జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్, ఎస్ఎంఎస్ కాల్స్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 200జీబీ డేటా రోల్ ఓవర్ ఉంటుంది. ఫ్యామిలీ ప్లాన్‌తో అదనంగా మరో సిమ్ కార్డు పొందొచ్చు.

JioPostpaid Plus Rs 799: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ రూ.799 ప్లాన్ ఎంచుకుంటే 150జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్, ఎస్ఎంఎస్ కాల్స్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 200జీబీ డేటా రోల్ ఓవర్ ఉంటుంది. ఫ్యామిలీ ప్లాన్‌తో అదనంగా రెండు సిమ్ కార్డులు పొందొచ్చు.

Realme Narzo 20 Series: రియల్‌మీ నార్జో 20 సిరీస్‌లో 3 స్మార్ట్‌ఫోన్స్... ఏది బెస్ట్ తెలుసుకోండి

IPL 2020 Special Jio Plans: ఐపీఎల్ మ్యాచ్‌లో ఫ్రీగా చూడాలా? జియోలో ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేయండి

JioPostpaid Plus Rs 999: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ రూ.999 ప్లాన్ ఎంచుకుంటే 200జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్, ఎస్ఎంఎస్ కాల్స్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 500జీబీ డేటా రోల్ ఓవర్ ఉంటుంది. ఫ్యామిలీ ప్లాన్‌తో అదనంగా మూడు సిమ్ కార్డులు పొందొచ్చు.

JioPostpaid Plus Rs 1499: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ రూ.1499 ప్లాన్ ఎంచుకుంటే 300జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్, ఎస్ఎంఎస్ కాల్స్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 500జీబీ డేటా రోల్ ఓవర్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ డేటాతో పాటు యూఎస్ఏ, యూఏఈకి కాల్స్ ఉచితం.

ప్రస్తుతం ఉన్న జియో కస్టమర్లు క్రెడిట్ లిమిట్ కొనసాగిస్తూ జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌లోకి మారొచ్చు. 88-501-88-501 నెంబర్‌‌కు వాట్సప్‌లో HI అని టైప్ చేసి పంపించాలి. ఆ తర్వాత జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ సిమ్ కార్డ్ ఇంటికి డెలివరీ చేస్తారు. లేదా కస్టమర్లు దగ్గర్లోని జియో స్టోర్ లేదా రిలయెన్స్ డిజిటల్ స్టోర్‌లో సంప్రదించొచ్చు. మైజియో యాప్ ద్వారా జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌లోకి మీ స్నేహితులను, కుటుంబ సభ్యులను ఆహ్వానించొచ్చు. జియో స్టోర్స్‌లో సెప్టెంబర్ 24 నుంచి జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ అందుబాటులో ఉంటుంది.

First published:

Tags: Amazon prime, Disney+ Hotstar, Jio, Netflix, Reliance Jio

ఉత్తమ కథలు