Home /News /technology /

RELIANCE JIO ANNOUNCED RS 333 RS 583 AND RS 783 PREPAID RECHARGE PLANS WITH DISNEY PLUS HOTSTAR MOBILE 3 MONTHS SUBSCRIPTION SS

Jio Hotstar Plan: ఒకసారి రీఛార్జ్ చేస్తే మూడు నెలల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... జియో నుంచి కొత్త ప్లాన్స్

Jio Hotstar Plan: ఒకసారి రీఛార్జ్ చేస్తే మూడు నెలల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... జియో నుంచి కొత్త ప్లాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Jio Hotstar Plan: ఒకసారి రీఛార్జ్ చేస్తే మూడు నెలల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... జియో నుంచి కొత్త ప్లాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Jio Hotstar Plans | డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకునే రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు గుడ్ న్యూస్. మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌లో జియో మూడు ప్లాన్స్ ప్రకటించింది.

రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు శుభవార్త. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో రిలయన్స్ జియో మరో మూడు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Jio Hotstar Plans) ప్రకటించింది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రూ.149 విలువైన మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. ఇందుకోసం కేవలం రూ.333, రూ.583, రూ.783 ప్లాన్ రీఛార్జ్ చేస్తే చాలు. ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అనేక ప్లాన్స్‌ను అందిస్తోంది రిలయన్స్ జియో. ఇప్పుడు జియో క్రికెట్ ప్లాన్స్‌లో భాగంగా మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో మరో ప్లాన్ ప్రకటించడం విశేషం. జియో యూజర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్లాన్స్ ఎంచుకోవచ్చు.

Jio Rs 333 Plan: జియో యూజర్లు రూ.333 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 42జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితం.

Jio Rs 583 Plan: జియో యూజర్లు రూ.583 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 84జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితం.

Poco M4 5G: కాసేపట్లో పోకో ఎం4 5జీ సేల్... రూ12,999 ధరకే 6GB+128GB స్మార్ట్‌ఫోన్

Jio Rs 783 Plan: జియో యూజర్లు రూ.783 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 126జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితం.

Jio 3 months Hotstar plans, Jio cricket plans, Jio Disney+ Hotstar Mobile plans, Jio Hotstar Mobile plans, Jio Hotstar plans, Jio ipl plans, జియో ఐపీఎల్ ప్లాన్స్, జియో క్రికెట్ ప్లాన్స్, జియో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్స్, జియో హాట్‌స్టార్ ప్లాన్స్, జియో హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్స్

జియో యూజర్లు రూ.333, రూ.583, రూ.783 ప్లాన్స్ రీఛార్జ్ చేసిన తర్వాత అదే నెంబర్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో లాగిన్ కావాలి. జియో నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉపయోగించుకోవచ్చు. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉన్న ఇతర కంటెంట్ చూడొచ్చు.

Vivo T1 Pro 5G: వివో టీ1 ప్రో 5జీ ప్రీ-బుకింగ్ ఈరోజే... ఎస్‌బీఐ కార్డ్ ఉన్నవారికి భారీ డిస్కౌంట్

మూడు నెలలు డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్ చేయాలంటే జియో ప్లాన్ యాక్టీవ్‌గా ఉండాలన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక రిలయన్స్ జియో రూ.499, రూ.799, రూ.1,066, రూ.3,119, రూ.2999, రూ.601, రూ.1499, రూ.4199 ప్లాన్స్‌కి, రూ.555, రూ.659 డేటా యాడ్ ఆన్ ప్లాన్లకు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Disney plus hotstar, Disney+ Hotstar, Jio, Reliance Jio

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు