హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio: వారికి రూ.249, రూ.299, రూ.349 ప్లాన్స్ ప్రకటించిన జియో... ఆ డివైజ్ ఉచితం

Jio: వారికి రూ.249, రూ.299, రూ.349 ప్లాన్స్ ప్రకటించిన జియో... ఆ డివైజ్ ఉచితం

Jio: వారికి రూ.249, రూ.299, రూ.349 ప్లాన్స్ ప్రకటించిన జియో... ఆ డివైజ్ ఉచితం
(ప్రతీకాత్మక చిత్రం)

Jio: వారికి రూ.249, రూ.299, రూ.349 ప్లాన్స్ ప్రకటించిన జియో... ఆ డివైజ్ ఉచితం (ప్రతీకాత్మక చిత్రం)

Jio | జియోఫై యూజర్ల కోసం రూ.249, రూ.299, రూ.349 ప్లాన్స్ ప్రకటించింది రిలయన్స్ జియో. జియోఫై హాట్‌స్పాట్ (Jiofi Hotspot) డివైజ్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇంటర్నెట్ ఉపయోగించాలనుకునేవారికి ఈ డివైజ్ ఉపయోగపడుతుంది.

రిలయన్స్ జియో జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ (JioFi 4G Wireless Hotspot) యూజర్ల కోసం మూడు కొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.249 నుంచి ప్రారంభం అవుతాయి. బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 30జీబీ డేటా ఒక నెల వేలిడిటీతో లభిస్తుంది. చిరువ్యాపారులు, సంస్థల్ని దృష్టిలో పెట్టుకొని జియో ఈ ప్లాన్స్ ప్రకటించింది. రూ.249, రూ.299, రూ.349 ప్లాన్స్‌ని పరిచయం చేసింది. ఈ ప్లాన్స్ వేలిడిటీ ఒక నెల. వేర్వేరు ప్లాన్స్‌కు వేర్వేరు బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ప్లాన్స్ మొబైల్ యూజర్స్‌కి కాదు కాబట్టి ఈ ప్లాన్స్‌కి డేటా బెనిఫిట్స్ మాత్రమే లభిస్తాయి. వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. 4జీ వైర్‌లెస్ డాంగిల్ ఉన్నవారికి ఈ ప్లాన్స్ ఉపయోగపడతాయి. మరి ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.

JioFi Rs 249 Plan: జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ యూజర్ జియోఫై రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేస్తే నెల రోజుల వేలిడిటీ లభిస్తుంది. 30జీబీ డేటా వాడుకోవచ్చు.

JioFi Rs 299 Plan: జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ యూజర్ జియోఫై రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే నెల రోజుల వేలిడిటీ లభిస్తుంది. 40జీబీ డేటా వాడుకోవచ్చు.

JioFi Rs 349 Plan: జియో ప్రకటించిన మూడు ప్లాన్స్‌లో రూ.349 ఖరీదైన ప్లాన్. రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేస్తే నెల రోజుల వేలిడిటీ లభిస్తుంది. 50జీబీ డేటా వాడుకోవచ్చు.

Mobile Offer: 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 64MP కెమెరా... అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 లోపే కొనేయండి

ఈ మూడు ప్లాన్స్‌పై జియో యూజర్లు ఉచితంగా జియోఫై పోర్టబుల్ డివైజ్ పొందొచ్చు. ఈ డివైజ్‌ను 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ డాంగిల్‌గా ఉపయోగించుకోవచ్చు. రీఛార్జ్ చేసిన ప్లాన్ ద్వారా ఎంత డేటా లభిస్తుందో అంత డేటా ఉపయోగించుకోవచ్చు. లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64కేబీపీఎస్‌కి పడిపోతుంది.

WhatsApp: వాట్సప్‌లో మెసేజ్ తప్పుగా పంపారా? ఎడిట్ చేయొచ్చు

జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్‌లో నానో సిమ్ ఉంటుంది. ఇందులో 2,300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ రీఛార్జ్ చేస్తే 6 గంటలపాటు 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. ఈ డాంగిల్‌కు 10 డివైజ్‌లు కనెక్ట్ చేయొచ్చు. జియో వెబ్‌సైట్‌లో లేదా మీకు దగ్గర్లో ఉన్న జియో స్టోర్, జియో రీటైలర్ల దగ్గర ఈ డివైజ్ లభిస్తుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Internet, Jio, JIOFI, Reliance Jio

ఉత్తమ కథలు