Jio New Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్... ఈ కొత్త ప్లాన్స్‌తో హాట్‌స్టార్‌లో కొత్త బెనిఫిట్స్

Jio New Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్... ఈ కొత్త ప్లాన్స్‌తో హాట్‌స్టార్‌లో కొత్త బెనిఫిట్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Jio New Plans | డిస్నీ+ హాట్‌స్టార్‌లో మొత్తం కంటెంట్‌కు యాక్సెస్ అందించేలా రిలయెన్స్ జియో (Reliance Jio) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
    రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. జియో కొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించడం మాత్రమే కాదు... ఇంతకుముందు యాక్సెస్ లేని మొత్తం కంటెంట్‌ను యూజర్లు యాక్సెస్ చేయొచ్చు. ఈ యాక్సెస్ అందించేందుకు రిలయెన్స్ జియో కొత్త ప్లాన్స్ రూపొందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి డిస్నీ+ హాట్‌స్టార్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న మొత్తం కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు. ఈ కొత్త జియో ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్, జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్, ఇతర బెనిఫిట్స్ లభిస్తాయి.

    గత ప్లాన్స్‌కి లేటెస్ట్ ప్లాన్స్‌కి తేడా ఏంటంటే?


    గతంలో జియో ప్లాన్ రీఛార్జ్ చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ మాత్రమే వచ్చింది. ఇందులో లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ స్పెషల్స్, బ్లాక్‌బస్టర్ మూవీస్, టీవీ షోస్, మూడు భారతీయ భాషల్లోని డబ్బింగ్ కంటెంట్ యాక్సెస్ లభించేది. లేటెస్ట్‌గా లాంఛ్ చేసిన కొత్త ప్లాన్స్‌తో డిస్నీ+ ఒరిజినల్స్, డిస్నీ టీవీ షోస్, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రఫిక్, హెచ్‌బీఓ, ఎప్ఎక్స్, షోటైమ్, 20TH సెంచరీ, సెర్చ్ లైట్ పిక్చర్స్ లాంటి కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు. జియో ప్రకటించిన కొత్త ప్లాన్స్ 2021 సెప్టెంబర్ 1న అందుబాటులోకి రానున్నాయి. మరి ఏఏ ప్లాన్స్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో ఇక్కడ తెలుసుకోండి.

    Free Smartphone: ఫ్లిప్‌కార్ట్‌లో ఉచితంగా స్మార్ట్‌ఫోన్... ఆఫర్ రేపటి వరకే

    జియో కొత్త ప్లాన్స్ వివరాలు ఇవే...


    Jio Rs 499 Prepaid Plan: జియో రూ.499 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 84జీబీ డేటా వాడుకోవచ్చు.

    Jio Rs 666 Prepaid Plan: జియో రూ.666 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 112జీబీ డేటా వాడుకోవచ్చు.

    Jio Rs 888 Prepaid Plan: జియో రూ.888 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 168జీబీ డేటా వాడుకోవచ్చు.

    Redmi Note 10 Pro Max: రూ.19,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.4,999 ధరకే కొనండి

    Jio Rs 2599 Prepaid Plan: జియో రూ.2599 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 730జీబీ డేటా వాడుకోవచ్చు.

    Jio Rs 549 Prepaid Plan: జియో రూ.549 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 84జీబీ డేటా వాడుకోవచ్చు.

    పైన వెల్లడించిన అన్ని ప్లాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.549 డేటా యాడ్ ఆన్ ప్లాన్ తప్ప మిగతా ప్లాన్స్‌కు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక ఇప్పటికే జియో హాట్‌స్టార్ ప్లాన్స్ రీఛార్జ్ చేసినవారికి ప్రస్తుతం ఉన్న బెనిఫిట్స్ లభిస్తాయి. వారి సబ్‌స్క్రిప్షన్ ముగిసేవరకు ఈ బెనిఫిట్స్ పొందొచ్చు. ఆ తర్వాత కొత్త ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: