ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. "జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా" (JioFiber Double Festival Bonanza) ఆఫర్‌ను ప్రకటించింది రిలయన్స్ జియో (Reliance Jio). ఏకంగా రూ.6,500 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. ఈ ఆఫర్లో భాగంగా రెండు ప్లాన్స్ ప్రకటించింది. ఆరు నెలల పాటు రూ.599 లేదా రూ.899 ప్లాన్ రీఛార్జ్ చేసి ఈ ఆఫర్ పొందొచ్చు. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కొత్త ఫైబర్ ప్లాన్స్ లేదా కొత్త కనెక్షన్స్ బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్స్ లభిస్తాయి. కేవలం రూ.599, రూ.899 ప్లాన్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇవి కొత్త ప్లాన్స్ కావు. కానీ అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ రెండు ప్లాన్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి.
జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్లో భాగంగా కస్టమర్ కొత్త జియోఫైబర్ కనెక్షన్ తీసుకొని 6 నెలల రూ.599 లేదా రూ.899 ప్లాన్ ఎంచుకుంటే ప్లాన్ బెనిఫిట్స్‌తో పాటు అదనంగా 2 బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అందులో ఒకటి 100 శాతం వ్యాల్యూబ్యాక్ కాగా, మరొకటి 15 రోజుల అదనపు వేలిడిటీ. ప్లాన్ వారీగా ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.
IRCTC Cruise Tour: ఓడలో ప్రయాణం, బస... ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
JioFiber Rs 599 Plan: జియోఫైబర్ రూ.599 ప్లాన్‌ను ఆరు నెలలకు తీసుకోవాలి. 30ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. 14 పైనే ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. 550 పైగా ఆన్ డిమాండ్ ఛానెల్స్ చూడొచ్చు. ఆరు నెలల ప్లాన్ కోసం రూ.3,594+రూ.649 జీఎస్టీ కలిపి మొత్తం రూ.4,241 చెల్లించాలి. కస్టమర్లకు రూ.4,500 విలువైన వోచర్స్ లభిస్తాయి. రూ.1,000 విలువైన ఆజియో వోచర్, రూ.1,000 విలువైన రిలయన్స్ డిజిటల్ వోచర్, రూ.1,000 విలువైన నెట్‌మెడ్స్ వోచర్, రూ.1,500 విలువైన ఇక్సిగో వోచర్స్ లభిస్తాయి. వీటన్నింటితో పాటు కస్టమర్లకు అదనంగా 15 రోజుల వేలిడిటీ లభిస్తుంది.
JioFiber Rs 899 Plan: జియోఫైబర్ రూ.899 ప్లాన్‌ను ఆరు నెలలకు తీసుకోవాలి. 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. 14 పైనే ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. 550 పైగా ఆన్ డిమాండ్ ఛానెల్స్ చూడొచ్చు. ఆరు నెలల ప్లాన్ కోసం రూ.5,394+రూ.971 జీఎస్టీ కలిపి మొత్తం రూ.6,365 చెల్లించాలి. కస్టమర్లకు రూ.6,500 విలువైన వోచర్స్ లభిస్తాయి. రూ.2,000 విలువైన ఆజియో వోచర్, రూ.1,000 విలువైన రిలయన్స్ డిజిటల్ వోచర్, రూ.500 విలువైన నెట్‌మెడ్స్ వోచర్, రూ.3,000 విలువైన ఇక్సిగో వోచర్స్ లభిస్తాయి. వీటన్నింటితో పాటు కస్టమర్లకు అదనంగా 15 రోజుల వేలిడిటీ లభిస్తుంది.
Flipkart Sale: ఆఫర్లో మొబైల్ కొనడానికి లాస్ట్ ఛాన్స్... ఈ 12 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
JioFiber Rs 899 Plan: జియోఫైబర్ రూ.899 ప్లాన్‌ను మూడు నెలలకు తీసుకున్నవారికీ ఆఫర్స్ ఉన్నాయి. 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. 14 పైనే ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. 550 పైగా ఆన్ డిమాండ్ ఛానెల్స్ చూడొచ్చు. మూడు నెలల ప్లాన్ కోసం రూ.3,182+రూ.485 జీఎస్టీ చెల్లించాలి. కస్టమర్లకు రూ.3,500 విలువైన వోచర్స్ లభిస్తాయి. రూ.1,000 విలువైన ఆజియో వోచర్, రూ.500 విలువైన రిలయన్స్ డిజిటల్ వోచర్, రూ.500 విలువైన నెట్‌మెడ్స్ వోచర్, రూ.1,500 విలువైన ఇక్సిగో వోచర్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌కు అదనపు వేలిడిటీ లభించదు.
పైన వివరించిన ప్లాన్స్ తీసుకున్న కస్టమర్లకు రూ.6,000 విలువైన 4కే జియోఫైబర్ సెటాప్ బాక్స్ ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JioFiber, Reliance Jio