Home /News /technology /

RELIANCE JIO ANNOUNCED HP SMART SIM LAPTOP OFFER GET 100GB DATA FOR FREE ON PURCHASING OF HP SMART SIM LAPTOPS SS

HP Smart SIM Laptop: రిలయన్స్ డిజిటల్‌లో హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ ఆఫర్... 100జీబీ డేటా ఉచితం

HP Smart SIM Laptop: రిలయన్స్ డిజిటల్‌లో హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ ఆఫర్... 100జీబీ డేటా ఉచితం

HP Smart SIM Laptop: రిలయన్స్ డిజిటల్‌లో హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ ఆఫర్... 100జీబీ డేటా ఉచితం

HP Smart SIM Laptop | కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్ (Reliance Digital) లేదా జియోమార్ట్‌లో 'హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్' కొనేవారికి మంచి ఆఫర్స్ ఉన్నాయి. 100జీబీ డేటా ఉచితంగా పొందొచ్చు.

రిలయన్స్ జియో 'హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్' (HP Smart SIM Laptop) ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్‌లో ఈ ల్యాప్‌టాప్ కొనొచ్చు. ఇది స్మార్ట్ ఎల్‌టీఈ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ కోసం జియో సిమ్ కనెక్షన్ (Jio SIM Connection) తీసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ కొనేవారికి జియో నుంచి 100జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. హెచ్‌పీ ల్యాప్‌టాప్స్ కొనే కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. హెచ్‌పీ ఎల్‌టీఈ ల్యాప్‌టాప్‌తో పాటు కొత్త జియో సిమ్ తీసుకుంటే రూ.1,500 విలువైన 100జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. 365 రోజుల పాటు ఈ డేటా ఉపయోగించుకోవచ్చు. are HP 14ef1003tu, HP 14ef1002tu ల్యాప్‌టాప్స్‌కు ఈ ఆఫర్ లభిస్తుంది.

రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, జియోమార్ట్‌లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో హెచ్‌పీ స్మార్ట్ ల్యాప్‌టాప్స్ కొన్నవారు ఈ ఆఫర్ పొందొచ్చు. ఆఫ్‌లైన్‌లో కొనాలంటే నేరుగా స్టోర్‌కు వెళ్లాలి. ఆన్‌లైన్‌లో కొనాలంటే reliancedigital.in లేదా JioMart.com వెబ్‌సైట్స్‌లో ఆర్డర్ చేయాలి. ఈ ల్యాప్‌టాప్ కొన్న తర్వాత ఉచితంగా సిమ్ కార్డ్ లభిస్తుంది. మొదట ఉచితంగా లభించే 100జీబీ డేటా పూర్తిగా వినియోగించిన తర్వాత అదనంగా 4జీ డేటా కోసం జియో డేటా ప్యాక్స్ లేదా ప్లాన్స్ రీఛార్జ్ చేయొచ్చు.

WhatsApp Status: ఇక ఆ ఫైల్స్ కూడా వాట్సప్ స్టేటస్‌గా పెట్టొచ్చు

free jio sim, HP Smart SIM Laptop, HP Smart SIM Laptop jio offer, HP Smart SIM Laptop offer, jio 100gb data free, jio hp smart sim laptop offer, జియో 100జీబీ డేటా ఉచితం, జియో సిమ్ ఉచితం, జియో హెచ్‌పీ ల్యాప్‌టాప్ ఆఫర్, హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్, హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ ఆఫర్

ఆఫ్‌లైన్‌లో కొనేవారు ముందుగా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు వెళ్లాలి. హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ కొన్న తర్వాత కొత్త జియో సిమ్ యాక్టివేట్ చేయమని కోరాలి. వారికి హెచ్‌పీ స్మార్ట్ ఎల్‌టీఈ 100జీబీ డేటా ఆఫర్ లభిస్తుంది. అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ వివరాలు ఇవ్వాలి. సిమ్ యాక్టివేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు.



ఆన్‌లైన్‌లో అయితే reliancedigital.in లేదా JioMart.com వెబ్‌సైట్స్‌లో ఆర్డర్ ప్లేస్ చేయాలి. ల్యాప్‌టాప్ డెలివరీ అయిన తర్వాత దగ్గర్లోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు 7 రోజుల్లోపు వెళ్లాలి. ఇన్‌వాయిస్ చూపించి హెచ్‌పీ స్మార్ట్ ఎల్‌టీఈ 100జీబీ డేటా ఆఫర్ యాక్టివేట్ చేయమని కోరాలి. అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ వివరాలు ఇచ్చిన తర్వాత సిమ్ యాక్టివేషన్ పూర్తవుతుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Jio, Laptop, Reliance Jio

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు