Reliance Jio: 'డిజిటల్ ఉడాన్' ప్రారంభించిన రిలయెన్స్ జియో... వివరాలివే

Reliance Jio 'Digital Udaan' Program | 'డిజిటల్ ఉడాన్' కార్యక్రమానికి ఫేస్‌బుక్‌తో కలిసి మాడ్యూల్స్ రూపొందించింది రిలయెన్స్ జియో.

news18-telugu
Updated: July 3, 2019, 6:40 PM IST
Reliance Jio: 'డిజిటల్ ఉడాన్' ప్రారంభించిన రిలయెన్స్ జియో... వివరాలివే
Reliance Jio: 'డిజిటల్ ఉడాన్' ప్రారంభించిన రిలయెన్స్ జియో... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
'డిజిటల్ ఉడాన్' పేరుతో డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టనుంది రిలయెన్స్ జియో. మొదటిసారి ఇంటర్నెట్ ఉపయోగించే వారికి ఇంటర్నెట్‌పై పూర్తి అవగాహన కల్పించే కార్యక్రమం ఇది. ప్రస్తుతం 30 కోట్లకు పైగా రిలయెన్స్ జియో యూజర్లు ఉండగా, వారిలో చాలామంది మొదటిసారి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నవారే. వారికోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది రిలయెన్స్ జియో. 'డిజిటల్ ఉడాన్' కార్యక్రమంలో భాగంగా ప్రతీ శనివారం యూజర్లకు జియోఫోన్ ఫీచర్లతో పాటు వేర్వేరు యాప్స్ ఉపయోగించడం, ఇంటర్నెట్ సేఫ్టీ, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేందుకు జియోఫోన్‌లో ఫేస్‌బుక్ ఉపయోగించడం లాంటివి నేర్పించనుంది జియో. 10 ప్రాంతీయ భాషల్లో ఆడియో-విజువల్ ట్రైనింగ్ ఉంటుంది.

భారతదేశ వినియోగదారుల డిజిటల్ లైఫ్ మెరుగుపర్చేందుకు ప్రపంచస్థాయి భాగస్వాములతో నిత్యం కలిసి పనిచేస్తోంది రిలయెన్స్ జియో. డిజిటల్ ఉడాన్ కార్యక్రమం ఓ ఉదాహరణ. సమాచార అసమానతల్ని తొలగించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. సమాచారం, విద్య, వినోదం కలగలిసిన కార్యక్రమం ఇది. దేశంలో 100% డిజిటల్ లిటరసీ లక్ష్యంగా ప్రతీ గ్రామం నుంచి పట్టణం వరకు అందరికీ శిక్షణ అందిస్తుంది రిలయెన్స్ జియో.
ఆకాశ్ అంబానీ, రిలయెన్స్ జియో డైరెక్టర్


Reliance Jio, Reliance Jio Digital Literacy Program, Reliance Jio Digital Udaan, Reliance Jio facebook Digital Udaan, internet users, how to use internet, రిలయెన్స్ జియో, రిలయెన్స్ జియో డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్, రిలయెన్స్ జియో డిజిటల్ ఉడాన్, రిలయెన్స్ జియో ఫేస్‌బుక్ డిజిటల్ ఉడాన్, ఇంటర్నెట్ యూజర్లు
Reliance Jio 'Digital Udaan' Program




'డిజిటల్ ఉడాన్' కార్యక్రమానికి ఫేస్‌బుక్‌తో కలిసి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన యూజర్లకు సులభంగా అర్థమయ్యేలా మాడ్యూల్స్ రూపొందించింది రిలయెన్స్ జియో. ట్రైన్-ద-ట్రైనర్ సెషన్స్, ట్రైనింగ్ వీడియోస్, సమస్త సమాచారంతో బ్రౌచర్లు అందించనుంది. 13 రాష్ట్రాల్లో 200 ప్రాంతాల్లో శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. కోట్లాది మంది జియో ఫోన్ యూజర్లతో పాటు మొదటిసారి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నవారి సాధికారత కోసం త్వరలో దేశంలోని 7,000 ప్రాంతాల్లో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది రిలయెన్స్ జియో.

భారతదేశంలో డిజిటల్ విప్లవంలో రిలయెన్స్ జియో కీలక పాత్ర పోషిస్తోంది. కోట్లాది మంది భారతీయులకు ఇంటర్నెట్ యాక్సెస్ అందిస్తోంది. ఈ ఉద్యమంలో ఫేస్‌బుక్ కూడా భాగస్వామిగా నిలుస్తోంది. కొత్త ఇంటర్నెట్ యూజర్లను ఆకట్టుకోవడానికి, వారికి శిక్షణ ఇవ్వడానికి మేం రిలయెన్స్ జియోతో చేతులు కలిపాం.
అజిత్ మోహన్, ఫేస్‌బుక్ ఇండియా ఎండీ, వీపీ
Loading...
యూజర్లను దేశానికి, ప్రపంచానికి డిజిటల్ రూపంలో కనెక్ట్ చేసేందుకు 'డిజిటల్ ఉడాన్' కార్యక్రమం ఉపయోగపడుతుంది. జియో యాప్స్, ఫేస్‌బుక్ ద్వారా వారికి విజ్ఞానంతో పాటు ప్రభుత్వ ప్రయోజనాలు, కార్యక్రమాల గురించి, అవసరమైన సేవలు, వినోదం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

Jio Cricket: మై జియో యాప్‌లో క్రికెట్ కాంటెస్ట్... ఆడండి ఇలా

JIO Plans: 4జీ డేటా కావాలా? జియో నుంచి టాప్-5 ప్లాన్స్ ఇవే

Jio Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ జియో యాప్స్ ఉన్నాయా? ఉపయోగాలు తెలుసుకోండి
First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...