హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio Rs 1 Plan: జియో మరో సంచలనం... ఒక్క రూపాయికే ప్రీపెయిడ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

Jio Rs 1 Plan: జియో మరో సంచలనం... ఒక్క రూపాయికే ప్రీపెయిడ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Jio Rs 1 Plan | రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. అతి తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్‌ను (Jio Prepaid Plan) ప్రకటించింది జియో. కేవలం ఒక్క రూపాయికే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వివరాలు తెలుసుకోండి.

  సంచలనాలకు మారుపేరైన రిలయన్స్ జియో (Reliance Jio) మరో సంచలనం సృష్టించింది. అతి తక్కువ ధరకే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (Prepaid Recharge Plan) ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే ప్లాన్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. మార్కెట్లోనే చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇది. ఇతర టెలికామ్ ఆపరేటర్లు ఎవరూ ఇంత తక్కువ ధరకే ప్లాన్స్ అందించట్లేదు. కానీ జియో రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 30 రోజుల వేలిడిటీ కూడా లభిస్తుంది. డేటా ఎక్కువగా అవసరం లేనివారికి ఉపయోగపడే ప్రీపెయిడ్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్‌లో 100 ఎంబీ డేటా లభిస్తుంది.

  జియో యూజర్లు రూ.1 ప్లాన్ రీఛార్జ్ చేయాలనుకుంటే మైజియో యాప్‌లో చూడొచ్చు. మైజియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత Other Plans ట్యాబ్ ఓపెన్ చేయాలి. అందులో Value సెక్షన్‌లో ఈ ప్లాన్ కనిపిస్తుంది. ఈ సెక్షన్‌లో రూ.1 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ, 100ఎంబీ డేటా లభిస్తుంది. ఈ మొత్తం డేటా వాడుకున్న తర్వాత స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.

  WhatsApp Groups: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్... ఇక ఆ సమస్యకు చెక్

  ఇటీవల ఎయిర్‌టెల్ , వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరల్ని పెంచిన తర్వాత రిలయన్స్ జియో కూడా టారిఫ్ పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరలు ఈ నెలలోనే అమల్లోకి వచ్చాయి. తక్కువ ధరలో ఉన్న ప్లాన్స్ వివరాలు చూస్తే రూ.91 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ, మొత్తం 3జీబీ డేటా, 50 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాల్స్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి.

  ఇక రూ.155 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ, నెలకు 2జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ, రోజూ 1జీబీ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి.

  ఎక్కువ డేటా ఉపయోగించేవారికి ప్రత్యేకమైన ప్లాన్స్ ఉన్నాయి. రూ.239 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ, రోజూ 1.5జీబీ డేటా రోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ, రోజూ 2జీబీ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెనిఫిట్స్ ఉన్నాయి.

  Flipkart Sale: స్మార్ట్‌ఫోన్ కొనాలా? ఇదే లాస్ట్ ఛాన్స్... ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ సేల్

  రూ.479 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ, రోజూ 1.5జీబీ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు. రూ.533 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ, రోజూ 2జీబీ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు. రూ.395 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ, మొత్తం 6జీబీ డేటా, మొత్తం 1000 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు.

  రూ.666 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ, రోజూ 1.5జీబీ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు. రూ.719 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ, రోజూ 2జీబీ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి.

  రూ.1599 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ, మొత్తం 24జీబీ డేటా, మొత్తం 3600 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రూ.2879 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ, రోజూ 2జీబీ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Jio, Reliance Jio

  ఉత్తమ కథలు