Jio New Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... నాన్ జియో కాల్స్‌ చేసుకోవచ్చు

Reliance Jio New Plans | ఇతర మొబైల్ నెట్‌వర్క్స్‌కు 1000 నిమిషాల వాయిస్ కాల్స్ ఉచితం. అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లు పంపొచ్చు. ఈ ప్లాన్‌కు అదనంగా రూ.111 చెల్లిస్తే మరో నెల సేవలు వాడుకోవచ్చు.

news18-telugu
Updated: October 21, 2019, 2:48 PM IST
Jio New Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... నాన్ జియో కాల్స్‌ చేసుకోవచ్చు
Jio New Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... నాన్ జియో కాల్స్‌ చేసుకోవచ్చు
news18-telugu
Updated: October 21, 2019, 2:48 PM IST
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలపై రిలయెన్స్ జియో మరో అస్త్రాన్ని సంధించింది. తమ యూజర్ల కోసం కొత్తగా ఆల్-ఇన్-వన్ ప్లాన్స్ ప్రకటించింది రిలయెన్స్ జియో. ఈ ప్లాన్స్ నెలకు రూ.222 ధర నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో అన్‌లిమిటెడ్ జియో టు జియో వాయిస్ కాల్స్‌తో పాటు ఇతర మొబైల్ ఆపరేటర్లకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. మొబైల్ డేటా కూడా వాడుకోవచ్చు. నెలకు రూ.222 రీఛార్జ్ చేస్తే రోజుకు 2జీబీ 4జీ డేటా లభిస్తుంది. జియో నెంబర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర మొబైల్ నెట్‌వర్క్స్‌కు 1000 నిమిషాల వాయిస్ కాల్స్ ఉచితం. అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లు పంపొచ్చు. ఈ ప్లాన్‌కు అదనంగా రూ.111 చెల్లిస్తే మరో నెల సేవలు వాడుకోవచ్చు. అంటే రూ.333 రీఛార్చ్ చేస్తే 2 నెలలు, రూ.444 చెల్లిస్తే 3 నెలలు ఈ సేవలు పొందొచ్చు.

మీరు ఇప్పటికే రోజుకు 2 జీబీ డేటా ప్లాన్‌లో మీరు ఉన్నట్టైతే ప్లాన్ ధర మూడు నెలలకు రూ.448 అవుతుంది. దాని బదులు ఆల్-ఇన్-వన్ ప్లాన్‌లోకి మారితే మూడు నెలలకు రూ.444 చెల్లిస్తే చాలు. అందులో ఇతర మొబైల్ నెట్‌వర్క్స్‌కి కాల్స్ లభిస్తాయి. అదే మీరు ఇతర నెట్‌వర్క్‌కి కాల్స్ కోసం వేరుగా ప్లాన్ తీసుకోవాలంటే అదనంగా రూ.80 చెల్లించాలి. రెండు నెలల ప్లాన్‌కు ఇదే వర్తిస్తుంది. ప్రస్తుతం రెండు నెలల ప్లాన్ రూ.396 ధరతో ఉంది. దాని బదులు రూ.333 రీఛార్జ్ చేస్తే చాలు. అదే ఎయిర్‌టెల్‌లో రోజుకు 2 జీబీ డేటా ప్లాన్స్ చూస్తే నెలకు రూ.249, రెండు నెలలకు రూ.498, మూడు నెలలకు రూ.747 చెల్లించాల్సి వస్తుంది. వొడాఫోన్ ఐడియాలో నెలకు రూ.229, రెండు నెలలకు రూ.458, మూడు నెలలకు రూ.687 చెల్లించాలి.

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Jio Diwali Offer: రూ.699 ధరకే జియో ఫోన్... ఈ దివాళీకి బెస్ట్ గిఫ్ట్

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి దివాళీ సేల్... ఈ 25 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్
Loading...
Smartphone: రూ.15,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కావాలా? ఇవే బెస్ట్ మోడల్స్
First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...