హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Unlimited Data Plans: అన్‌లిమిటెడ్ డేటా కావాలా? Jio, Airtel, Vi, BSNL ప్లాన్స్ ఇవే

Unlimited Data Plans: అన్‌లిమిటెడ్ డేటా కావాలా? Jio, Airtel, Vi, BSNL ప్లాన్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Unlimited Data Plans | మీరు అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారా? రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.

ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా గతంలో డైలీ డేటా లిమిట్ ఉండేది. అంటే రోజూ 1జీబీ, 1.5జీబీ, 2జీబీ, 3జీబీ డేటా చొప్పున ప్లాన్స్ ఉండేవి. ఎంత లిమిట్ ఉంటే అంత లిమిట్ డేటా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇప్పటికీ ఈ ప్లాన్స్ ఉన్నాయి. వీటితో పాటు అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి టెలికాం కంపెనీలు. రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు అన్‌లిమిటెడ్ డేటాతో కొత్త ప్లాన్స్ ప్రకటించాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే డైలీ డేటా లిమిట్ ఉండదు. ఎంతైనా డేటా వాడుకోవచ్చు. రీఛార్జ్ చేసినప్పుడు కేటాయించిన మొత్తం డేటాలో ఉపయోగించిన డేటా తగ్గిపోతూ ఉంటుంది. వేలిడిటీ ఉన్నన్ని రోజులు డేటా వాడుకోవచ్చు. మరి రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ గురించి తెలుసుకోండి.

Jio Rs 2,397 plan: రిలయెన్స్ జియో రూ.2,397 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 365జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

Earphones: ఆ ఇయర్‌ఫోన్స్ ధర రూ.1,29,990... షాకయ్యారా? ఎందుకో తెలుసుకోండి

Ola e-Scooter: రూ.499 ధరకే ఓలా స్కూటర్ రిజర్వేషన్... బుకింగ్ చేయండి ఇలా

Jio Rs 597 plan: రిలయెన్స్ జియో రూ.597 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 90 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 75జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

Jio Rs 447 plan: రిలయెన్స్ జియో రూ.447 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 60 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 50జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

Jio Rs 247 plan: రిలయెన్స్ జియో రూ.247 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 25జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

Jio Rs 127 plan: రిలయెన్స్ జియో రూ.127 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 15 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 12జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

WhatsApp: ఒకే వాట్సప్ అకౌంట్ 4 డివైజ్‌లలో వాడుకోవచ్చు... కొత్త ఫీచర్ వచ్చేసింది

Asus Chromebook: ఏసుస్ సంచలనం... రూ.17,999 ధరకే ల్యాప్‌టాప్

​Airtel Rs 456 plan: ఎయిర్‌టెల్ రూ.456 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 60 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 50జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాక్సెస్, ఫాస్ట్‌ట్యాగ్‌పై క్యాష్‌బ్యాక్ లభిస్తాయి.

​Airtel Rs 299 plan: ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 30జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాక్సెస్, ఫాస్ట్‌ట్యాగ్‌పై క్యాష్‌బ్యాక్ లభిస్తాయి.

Vi Rs 447 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.447 రీఛార్జ్ చేస్తే 60 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 50 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ ఉచితం.

Mi 11 Ultra 5G: కాసేపట్లో ఎంఐ 11 అల్‌ట్రా సేల్... రూ.5000 డిస్కౌంట్ పొందండి ఇలా

Smartphone Tips: మీ పాత స్మార్ట్‌ఫోన్ అమ్ముతున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

Vi Rs 267 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.267 రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 25 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ ఉచితం.

BSNL Rs 447 plan: బీఎస్ఎన్ఎల్ రూ.447 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 60 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 100 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, ఎరాస్ నౌ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

First published:

Tags: AIRTEL, Airtel recharge plans, BSNL, Jio, Reliance Jio, Vodafone Idea

ఉత్తమ కథలు