Good News: మొబైల్ యూజర్లకు శుభవార్త... రీఛార్జ్ చేయొచ్చు ఇలా

Recharge at ATM | మీ దగ్గర ఏటీఎం కార్డు, దగ్గర్లో ఏటీఎం సెంటర్ ఉంటే చాలు. రీఛార్జ్ చేయడం సులువు. ఇందుకోసం బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి టెలికామ్ కంపెనీలు.

news18-telugu
Updated: April 6, 2020, 6:44 PM IST
Good News: మొబైల్ యూజర్లకు శుభవార్త... రీఛార్జ్ చేయొచ్చు ఇలా
Good News: మొబైల్ యూజర్లకు శుభవార్త... రీఛార్జ్ చేయొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మొబైల్ నెంబర్‌కు రీఛార్జ్ చేయాలంటే పేటీఎం, అమెజాన్ పే, ఫోన్‌పే లాంటి యాప్స్ ఉంటే చాలా సింపుల్. కానీ అందరూ ఈ యాప్స్ ఉపయోగించరు. ఇప్పటికీ బయట షాపుల్లో రీఛార్జ్ చేయించుకోవడం చాలామందికి అలవాటు. అయితే లాక్‌డౌన్ కారణంగా షాప్స్‌లో రీఛార్జ్ చేయించడం సాద్యం కావట్లేదు. అందుకే మొబైల్ కంపెనీలు ఏటీఎంలు, ఎస్ఎంఎస్ ద్వారా రీఛార్జ్ చేసే పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికే రిలయెన్స్ జియో ఏటీఎం ద్వారా రీఛార్జ్ ప్రాసెస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎయిర్‌టెల్, వొడాఫోన్ కూడా ఈ సిస్టమ్ ప్రారంభించాయి. మీ దగ్గర ఏటీఎం కార్డు, దగ్గర్లో ఏటీఎం సెంటర్ ఉంటే చాలు. రీఛార్జ్ చేయడం సులువు. ఇందుకోసం బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి టెలికామ్ కంపెనీలు. రిలయెన్స్ జియో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిటీ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఏయూఎఫ్ బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. ఎయిర్‌టెల్ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో, వొడాఫోన్ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్, సిటీ, డీసీబీ, ఐడీబీఐ, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నాయి. ఎయిర్‌టెల్ యూజర్లు బిగ్ బజార్, అపోలో ఫార్మసీల్లో కూడా రీఛార్జ్ చేయొచ్చు.

ఏటీఎం ద్వారా రీఛార్జ్ చేసేందుకు ముందు మీ డెబిట్ కార్డును ఇన్సర్ట్ చేయండి. మెనూలో 'Recharge' ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. 10 అంకెలు మాత్రమే ఎంటర్ చేయాలి. కంట్రీ కోడ్ అంటే 91 ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటారో అంత అమౌంట్ టైప్ చేయండి. ఆ తర్వాతి స్టెప్‌లో కన్ఫామ్ చేయాలి. స్క్రీన్ పైన రీఛార్జ్ మెసేజ్ కనిపిస్తుంది. మీ అకౌంట్‌లోంచి డబ్బులు డెబిట్ అవుతాయి. మీ మొబైల్ నెంబర్‌కు మీ నెట్వర్క్‌ నుంచి మెసేజ్ వస్తుంది.

జియో యూజర్లు ఎస్ఎంఎస్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు Mobile స్పేస్ 10 అంకెల మొబైల్ నెంబర్ స్పేస్ ఇచ్చి JIO స్పేస్ అమౌంట్ స్పేస్ బ్యాంక్ అకౌంట్‌లోని చివరి 6 నెంబర్లు టైప్ చేసి 9717000002 లేదా 5676782 నెంబర్లకు ఎస్ఎంఎస్ చేయాలి. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు MTOPUP స్పేస్ JIO స్పేస్ 10 అంకెల ఫోన్ నెంబర్ స్పేస్ అమౌంట్ స్పేస్ బ్యాంకు అకౌంట్‌లోని చివరి 6 నెంబర్లు టైప్ చేసి 9222208888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.

ఇవి కూడా చదవండి:

Lockdown: మొబైల్ యాప్స్‌తో అప్పు తీసుకోవచ్చు... కానీ ఈ విషయాలు గుర్తుంచుకోండి

Lockdown: ఏటీఎం కార్డులు వాడట్లేదా? స్విచ్చాఫ్ చేయండి ఇలా

Savings: పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లు ఇవే...
First published: April 6, 2020, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading