హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Prepaid Plans: 84 రోజుల వేలిడిటీతో Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే

Prepaid Plans: 84 రోజుల వేలిడిటీతో Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే

Prepaid Plans | రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi 84 రోజుల వేలిడిటీతో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.

Prepaid Plans | రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi 84 రోజుల వేలిడిటీతో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.

Prepaid Plans | రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi 84 రోజుల వేలిడిటీతో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.

  మీరు మూడు నెలలు అంటే 84 వేలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi కంపెనీలు 84 రోజుల వేలిడిటీతో అనేక ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. వేలిడిటీ 84 రోజులే ఉంటుంది. కానీ డేటా బెనిఫిట్స్, ఇతర ప్రయోజనాల్లో మార్పులు ఉంటాయి. అందుకే కస్టమర్లు రీఛార్జ్ చేసేముందు ఆ ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఈ ప్లాన్స్ దాదాపు మూడు నెలల వేలిడిటీతో వస్తాయి. కాబట్టి ఒకసారి రీఛార్జ్ చేస్తే మూడు నెలల పాటు రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi అందిస్తున్న 84 రోజుల వేలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.

  Jio Rs 555 Plan: రిలయెన్స్ జియో రూ.555 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున వాడుకోవచ్చు 126జీబీ డేటా వాడుకోవచ్చు. ఇక వీటితో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

  Moto E7 Power: భారీ బ్యాటరీతో మోటో ఈ7 పవర్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర రూ.7,499 నుంచి

  Poco M3: కాసేపట్లో పోకో ఎం3 హెలో ఎల్లో సేల్... ఆఫర్స్ ఇవే

  Jio Rs 599 Plan: రిలయెన్స్ జియో రూ.599 రీఛార్జ్ చేసేవారికి 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 168 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

  Jio Rs 777 Plan: రిలయెన్స్ జియో రూ.777 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున వాడుకోవచ్చు 126జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 131జీబీ 4జీ డేటాను ఉపయోగించొచ్చు. ఇక వీటితో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వీటన్నిటితో పాటు రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  Jio Rs 999 Plan: రిలయెన్స్ జియోలో రూ.999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 252జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

  Realme X7 5G: కాసేపట్లో రియల్‌మీ ఎక్స్7 5జీ సేల్... ఆఫర్స్ ఇవే

  Realme X7 Pro 5G: రూ.29,999 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,000 లోపే కొనండి ఇలా

  Airtel Rs 379 plan: ఎయిర్‌టెల్‌లో రూ.379 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 6జీబీ డేటా, 900ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ప్రైమీ వీడియో మొబైల్ ఎడిషన్ యాక్సెస్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఫాస్ట్‌ట్యాగ్‌పై క్యాష్ బ్యాక్, హెలో ట్యూన్స్, షా అకాడమీ నుంచి ఆన్‌లైన్ కోర్సులు ఉచితం.

  Airtel Rs 598 plan: ఎయిర్‌టెల్‌లో రూ.598 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున 84 రోజులకు 126జీబీ డేటా ఉపయోగించొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఫాస్ట్‌ట్యాగ్‌పై క్యాష్‌బ్యాక్, ఆన్‌లైన్ కోర్సులు, హెలో ట్యూన్స్ ఉచితంగా లభిస్తాయి.

  Airtel Rs 698 plan: ఎయిర్‌టెల్‌లో రూ.698 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున ఉపయోగించొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.150 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు చేయొచ్చు. ఉచితంగా హెలో ట్యూన్స్ లభిస్తాయి.

  Vi Rs 379 Plan: వొడాఫోన్ ఐడియా రూ.379 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 6జీబీ డేటా వాడుకోవచ్చు. 1000 ఎస్ఎంఎస్‌లు ఉచితం. వీఐ మూవీస్, టీవీ బేసిక్ యాక్సెస్ లభిస్తుంది.

  Phone Calls: అలర్ట్... కాల్స్ ఎక్కువ చేస్తున్నారా? డేటా ఎక్కువ వాడుతున్నారా? ఏప్రిల్ 1 నుంచి షాకే

  Prepaid Plans: రూ.300 లోపు Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

  Vi Rs 599 Plan: వొడాఫోన్ ఐడియా రూ.599 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ చొప్పున మొత్తం 126జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ బేసిక్ యాక్సెస్ లభిస్తుంది. దీంతో పాటు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎంతైనా డేటా వాడుకోవచ్చు. డేటా రోల్ ఓవర్ వర్తిస్తుంది. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉపయోగించని డేటాను వీకెండ్‌లో వాడుకోవచ్చు.

  Vi Rs 699 plan: వొడాఫోన్ ఐడియాలో రూ.699 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. డబుల్ డేటా ఆఫర్‌తో రోజూ 4జీబీ డేటా ఉపయోగించొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్‌లో వీకెండ్ రోల్ ఓవర్ బెనిఫిట్ ఉంది. అంటే ఆ వారంలో ఉపయోగించని డేటాను వీకెండ్‌లో వాడుకోవచ్చు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎంతైనా డేటా వాడుకోవచ్చు. వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా అదనంగా లభిస్తుంది. వీఐ మూవీస్ చూడొచ్చు. జొమాటో ఆర్డర్లపై రూ.75 డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపీఎల్‌లో గేమ్స్ ఆడితే రూ.125 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

  Vi Rs 795 plan: వొడాఫోన్ ఐడియాలో రూ.795 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా ఉపయోగించొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్‌లో వీకెండ్ రోల్ ఓవర్ బెనిఫిట్ ఉంది. అంటే ఆ వారంలో ఉపయోగించని డేటాను వీకెండ్‌లో వాడుకోవచ్చు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎంతైనా డేటా వాడుకోవచ్చు. జీ5 ప్రీమియం ఏడాది సబ్‍స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వీఐ మూవీస్ చూడొచ్చు.

  Vi Rs 599 plan: వొడాఫోన్ ఐడియాలో రూ.599 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున ఉపయోగించొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్‌లో వీకెండ్ రోల్ ఓవర్ బెనిఫిట్ ఉంది. అంటే ఆ వారంలో ఉపయోగించని డేటాను వీకెండ్‌లో వాడుకోవచ్చు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎంతైనా డేటా వాడుకోవచ్చు. వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా అదనంగా లభిస్తుంది. వీఐ మూవీస్ చూడొచ్చు.

  First published:

  Tags: AIRTEL, Airtel recharge plans, Jio, Reliance Jio, VODAFONE, Vodafone Idea

  ఉత్తమ కథలు