హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Data Add on Plans: అదనంగా డేటా కావాలా? Jio, Airtel, Vi డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ ఇవే

Data Add on Plans: అదనంగా డేటా కావాలా? Jio, Airtel, Vi డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ ఇవే

Data Add on Plans: అదనంగా డేటా కావాలా? Jio, Airtel, Vi డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Data Add on Plans: అదనంగా డేటా కావాలా? Jio, Airtel, Vi డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Data Add on Plans | మీరు రీఛార్జ్ చేసుకున్న ప్రీపెయిడ్ ప్లాన్‌పై (Prepaid Plan) రోజూ లభించే డేటా చాలట్లేదా? అదనంగా డేటా కావాలా? అయితే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) యూజర్లు ఏ ప్లాన్స్ రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి.

స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు రోజూ 1జీబీ, 1.5జీబీ, 2జీబీ, 3జీబీ డేటా ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ (Prepaid Plans) రీఛార్జ్ చేస్తూ ఉంటారు. రోజూ ఎంత లిమిట్ ఉందో అంత డేటా వాడుకోవచ్చు. అయితే ఒక్కోసారి లిమిట్ దాటిన తర్వాత కూడా డేటా వాడుకోవాల్సి వస్తుంది. కానీ డేటా ఉండదు. ఇలాంటి సమయంలో డేటా యాడ్ ఆన్ (Data add on) ప్లాన్స్ రీఛార్జ్ చేయొచ్చు. ఇవి కేవలం డేటా ప్లాన్స్ మాత్రమే. ఇందులో వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ అందిస్తున్నాయి. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎంత డేటా వస్తుందో తెలుసుకోండి.

జియో డేటా యాడ్ ఆన్ ప్లాన్స్


జియో యూజర్లు రూ.26 రీఛార్జ్ చేస్తే 2జీబీ డేటా, రూ.62 రీఛార్జ్ చేస్తే 6జీబీ డేటా, రూ.86 రీఛార్జ్ చేస్తే రోజూ 0.5జీబీ డేటా, రూ.122 రీఛార్జ్ చేస్తే రోజూ 1జీబీ డేటా, రూ.182 రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా అదనంగా వాడుకోవచ్చు. ఈ ప్లాన్స్ అన్నింటికీ 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది.

EPF Pension Rule: పిల్లలకు కూడా ప్రతీ నెలా పెన్షన్... ఈ ఈపీఎఫ్ఓ రూల్ తెలుసా?

ఎయిర్‌టెల్ డేటా యాడ్ ఆన్ ప్లాన్స్


ఎయిర్‌టెల్ యూజర్లు రూ.118 రీఛార్జ్ చేస్తే 12జీబీ డేటా, రూ.301 రీఛార్జ్ చేస్తే 50జీబీ డేటా, రూ.58 రీఛార్జ్ చేస్తే 3జీబీ డేటా, రూ.148 రీఛార్జ్ చేస్తే 15జీబీ డేటా, రూ.108 రీఛార్జ్ చేస్తే 6జీబీ డేటా, రూ.98 రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్స్‌కు వేలిడిటీ ఉండదు. రూ.98, రూ.301 ప్లాన్స్‌పై వింక్ మ్యూజిక్ ప్రీమియం, రూ.148 ప్లాన్‌పై ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్, రూ.108 ప్లాన్‌పై అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్, ఉచితంగా హెలో ట్యూన్స్ లభిస్తాయి.

Ticket Booking: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... టికెట్ బుకింగ్‌లో ఈ రూల్ గుర్తుంచుకోండి

వొడాఫోన్ ఐడియా డేటా యాడ్ ఆన్ ప్లాన్స్


వొడాఫోన్ ఐడియా యూజర్లు రూ.601 రీఛార్జ్ చేస్తే 75జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 56 రోజులు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రూ.418 రీఛార్జ్ చేస్తే 56 రోజుల్లో 100జీబీ డేటా, రూ.118 రీఛార్జ్ చేస్తే 28 రోజుల్లో 12జీబీ డేటా, రూ.58 రీఛార్జ్ చేస్తే 28 రోజుల్లో 3జీబీ డేటా, రూ.298 రీఛార్జ్ చేస్తే 28 రోజుల్లో 50జీబీ డేటా, రూ.19 రీఛార్జ్ చేస్తే 24 గంటల్లో 1జీబీ డేటా, రూ.98 రీఛార్జ్ చేస్తే 21 రోజుల్లో 9జీబీ డేటా, రూ.48 రీఛార్జ్ చేస్తే 21 రోజుల్లో 2జీబీ డేటా వాడుకోవచ్చు.

పైన వెల్లడించిన ప్లాన్స్ అన్నీ డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ మాత్రమే. అంటే ఇప్పటికే ఓ యాక్టీవ్ ప్లాన్‌లో ఉన్నవారు అదనంగా డేటా కావాలనుకుంటే ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్స్‌కు డేటా మాత్రమే వస్తుంది. సర్వీస్ వేలిడిటీ రాదు.

First published:

Tags: AIRTEL, Airtel recharge plans, Jio, Reliance Jio, Vodafone Idea

ఉత్తమ కథలు