హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

30 Days Validity: జియో, ఎయిర్‌టెల్, Vi యూజర్లకు 30 రోజుల వేలిడిటీ ప్లాన్స్ ఇవే

30 Days Validity: జియో, ఎయిర్‌టెల్, Vi యూజర్లకు 30 రోజుల వేలిడిటీ ప్లాన్స్ ఇవే

30 Days Validity: జియో, ఎయిర్‌టెల్, Vi యూజర్లకు 30 రోజుల వేలిడిటీ ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

30 Days Validity: జియో, ఎయిర్‌టెల్, Vi యూజర్లకు 30 రోజుల వేలిడిటీ ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

30 Days Validity | జియో, ఎయిర్‌టెల్, Vi యూజర్లకు 30 రోజుల వేలిడిటీతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Recharge Plans) అందుబాటులో ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) నుంచి ఎక్కువగా 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Recharge Plans) అందుబాటులో ఉంటాయి. అయితే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాలతో టెలికాం కంపెనీలు 30 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ (30 Days Validity Plans) రూపొందించాయి. ఇటీవల ఎయిర్‌టెల్ రూ.199 ధరకు 30 రోజుల వేలిడిటీ ప్లాన్‌ను ప్రకటించింది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ నుంచి ఇప్పటికే 30 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ ఉన్నాయి. మరి ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి.

Airtel Rs 199 Plan: ఎయిర్‌టెల్ ఇటీవల తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ఇది. ఎయిర్‌టెల్ యూజర్లు రూ.199 రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 3జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. డేటా తక్కువ ఉపయోగిస్తూ, వైఫై ఎక్కువ ఉపయోగించేవారు, కేవలం కాల్స్ కోసం సిమ్ కార్డ్ ఉపయోగించేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.

WhatsApp Communities: వాట్సప్ కమ్యూనిటీస్ ఫీచర్‌తో ఉపయోగాలివే... మీరూ క్రియేట్ చేయండిలా

Airtel Rs 296 Plan: ఎయిర్‌టెల్ రూ.296 రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 25జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ లాంటి బెనిఫిట్స్ లభిస్తాయి.

Jio Rs 296 Plan: జియో రూ.296 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 25జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

Vi Rs 327 Plan: వొడాఫోన్ ఐడియా రూ.327 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 25జీబీ డేటా ఉపయోగించవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీఐ మూవీస్ యాక్సెస్ లభిస్తుంది.

Redmi 10 Power: రూ.12,000 లోపే 8GB+128GB స్మార్ట్‌ఫోన్ కొనేయండి... అదిరిపోయే ఆఫర్

రిలయన్స్ జియో , ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నుంచి లభిస్తున్న 30రోజుల వేలిడిటీ ప్లాన్స్ బేసిక్ ప్లాన్‌గా వాడుకోవచ్చు. ఈ ప్లాన్స్‌లో డేటా బెనిఫిట్స్ తక్కువగా ఉంటాయి. కానీ అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రెండు సిమ్ కార్డులు వాడుతున్నవారు మెయిన్ సిమ్ కాకుండా సెకండరీ సిమ్‌ను యాక్టీవ్‌గా ఉంచడానికి ఈ ప్లాన్స్ ఉపయోగపడతాయి.

First published:

Tags: AIRTEL, Airtel recharge plans, Jio, Reliance Jio, Vodafone Idea

ఉత్తమ కథలు