హోమ్ /వార్తలు /technology /

Reliance Jio: రిలయెన్స్ జియో జోరు... ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా విలవిల

Reliance Jio: రిలయెన్స్ జియో జోరు... ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా విలవిల

Reliance Jio | టెలికామ్ సెక్టార్‌లో రిలయెన్స్ జియో జోరు ఏ స్థాయిలో కొనసాగుతుందో ఈ లెక్కలు చెబుతున్నాయి.

Reliance Jio | టెలికామ్ సెక్టార్‌లో రిలయెన్స్ జియో జోరు ఏ స్థాయిలో కొనసాగుతుందో ఈ లెక్కలు చెబుతున్నాయి.

Reliance Jio | టెలికామ్ సెక్టార్‌లో రిలయెన్స్ జియో జోరు ఏ స్థాయిలో కొనసాగుతుందో ఈ లెక్కలు చెబుతున్నాయి.

  టెలికామ్ రంగంలో రిలయెన్స్ జియో జోరు కొనసాగుతోంది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI తాజా లెక్కల ప్రకారం సెప్టెంబర్‌లో రిలయెన్స్ జియోలో 69.83 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. జియో ప్రత్యర్థి కంపెనీలైన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ సెప్టెంబర్‌లో ఏకంగా 49 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. టెలికామ్ సెక్టార్‌లో రిలయెన్స్ జియో జోరు ఏ స్థాయిలో కొనసాగుతుందో ఈ లెక్కలు చెబుతున్నాయి. సెప్టెంబర్‌లో భారతీ ఎయిర్‌టెల్ 23.8 లక్షల యూజర్లను కోల్పోవడంతో 32.55 కోట్ల సబ్‌స్క్రైబర్ల సంఖ్యకు చేరుకుంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా 25.7 లక్షల యూజర్లను కోల్పోగా యూజర్ బేస్ 32.55 కోట్లకు చేరుకుంది. రిలయెన్స్ జియోకు 69.83 లక్షల యూజర్లను పెంచుకొని 35.52 కోట్ల సబ్‌స్క్రైబర్లతో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2019 సెప్టెంబర్ 30 నాటికి వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్ మార్కెట్ షేర్ 31.73 శాతం కాగా, రిలయెన్స్ జియో మార్కెట్ షేర్ 30.26 శాతం, భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ షేర్ 27.74 శాతం.

  ఇక ప్రభుత్వానికి చెందిన బీఎస్ఎన్ఎల్‌లో 7.37 లక్షల మంది యూజర్లు చేరడంతో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 11.69 కోట్లకు చేరుకుంది. ఎంటీఎన్ఎల్ 8717 యూజర్లను కోల్పోయి 33.93 లక్షలకు చేరుకుంది. మొత్తంగా చూస్తే జీఎస్ఎం, సీడీఎంఏ, ఎల్టీఈ వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2019 సెప్టెంబర్ చివరి నాటికి 117.37 కోట్లకు చేరుకుంది. ఆగస్ట్ చివరి నాటికి ఈ సంఖ్య 117.1 కోట్లు మాత్రమే. అంటే నెలలో 0.23 శాతం వృద్ధి కనిపించినట్టు ట్రాయ్ వెల్లడించింది. సెప్టెంబర్ చివరి నాటికి అర్బన్ ప్రాంతాల్లో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 65.91 కోట్లకు తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో 51.45 కోట్లకు పెరిగింది.

  మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?

  ఇవి కూడా చదవండి:

  SBI FASTag: డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి... ఎస్‌బీఐలో కొనండి ఇలా

  SBI: ఏటీఎం పనిచేయట్లేదా? కిరాణా షాప్‌లో డబ్బులు తీసుకోవచ్చు ఇలా

  Business Idea: రూ.50,000 పెట్టుబడితో ఫాస్ట్‌ట్యాగ్ బిజినెస్ స్టార్ట్ చేయండి ఇలా

  First published:

  ఉత్తమ కథలు