Reliance Jio: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న జియో జోరు

Reliance Jio | ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్ (తెలంగాణ, ఏపీ)లో రిలయెన్స్ జియో ఏకంగా 6 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవడం విశేషం.

news18-telugu
Updated: June 26, 2019, 6:54 PM IST
Reliance Jio: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న జియో జోరు
Reliance Jio: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న జియో జోరు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 26, 2019, 6:54 PM IST
రిలయెన్స్ జియో... సంచలనాలకు కేంద్రబిందువైనా టెలికాం కంపెనీ. కంపెనీ ప్రారంభించినాటి నుంచి ఇప్పటికీ జియో సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న రిలయెన్స్ జియో... తెలుగు రాష్ట్రాల్లో మరింత వేగంగా దూసుకెళ్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్ (తెలంగాణ, ఏపీ)లో రిలయెన్స్ జియో ఏకంగా 6 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవడం విశేషం. జియో ధాటికి పోటీ కంపెనీలైన ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య భారీగా పడిపోయింది. ఏప్రిల్ చివరి నాటికి తెలుగురాష్ట్రాల్లో రిలయెన్స్ జియో వినియోగదారుల సంఖ్య 2.5 కోట్లకు చేరుకుంది. టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా టెలికాం కనెక్షన్ల సంఖ్య ఏప్రిల్ చివరి నాటికి 118.37 కోట్లకు చేరింది.

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:



Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలా

New Rules: జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే...

LG Smartphone: రూ.9,999 ధరకే ట్రిపుల్ కెమెరా ఫోన్... ఎల్‌జీ సంచలనం
First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...