JIO Plans: జియో నుంచి 4జీ డేటా కోసం టాప్-5 ప్లాన్స్ ఇవే...

Reliance JIO Prepaid plans | రూ.98 నుంచే ప్లాన్స్ మొదలవుతాయి. జియో 4జీ డేటాతో పాటు వాయిస్ కాల్స్ ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

news18-telugu
Updated: June 2, 2019, 6:53 PM IST
JIO Plans: జియో నుంచి 4జీ డేటా కోసం టాప్-5 ప్లాన్స్ ఇవే...
JIO Plans: జియో నుంచి 4జీ డేటా కోసం టాప్-5 ప్లాన్స్ ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు రిలయెన్స్ జియో సబ్‌స్క్రైబరా? మీరు జియో సిమ్ ఉపయోగిస్తున్నారా? 4జీ డేటా ఎక్కువగా వినియోగిస్తారా? జియో నుంచి 4జీ మొబైల్ డేటా కోసం బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి. రిలయెన్స్ జియో వచ్చిన తర్వాత 4జీ ప్లాన్స్ ధరలు భారీగా తగ్గిపోయాయి. ఇటీవల జియో కూడా ప్లాన్స్ ధరల్ని తగ్గించడం విశేషం. రూ.98 నుంచే ప్లాన్స్ మొదలవుతాయి. జియో 4జీ డేటాతో పాటు వాయిస్ కాల్స్ ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మీరు ఎంచుకునే ప్లాన్‌ను బట్టి బెనిఫిట్స్ మారుతుంటాయి. మీరు రోజుకు ఎంత 4జీ డేటా ఉపయోగిస్తారో దాన్ని బట్టి ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకోవాలి. మరి రిలయెన్స్ జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో బెస్ట్ ప్లాన్ ఏదీ? 4జీ డేటా కోసం ఏ రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవాలో తెలుసుకోండి.

జియో రూ.98 ప్లాన్: ఇది చీప్ అండ్ బెస్ట్ ప్లాన్. తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. మీరు తక్కువ డేటా ఉపయోగిస్తారంటే ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. 28 రోజుల వేలిడిటీ. 2జీబీ డేటా వస్తుంది. దాంతోపాటు 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో సేవల్ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

Reliance Jio Prepaid Plans, Reliance Jio 4G data, JIO 4G plans, Reliance JIO 4G plans,  JIO 98 plan benefits, JIO 1699 plan benefits,  JIO 449 plan benefits, JIO 398 plan benefits, JIO 299 plan benefits, రిలయెన్స్ జియో 4జీ ప్లాన్స్, రిలయెన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్, జియో రూ.1,699 ప్లాన్ బెనిఫిట్స్,  జియో రూ.398 ప్లాన్ బెనిఫిట్స్, జియో రూ.299 ప్లాన్ బెనిఫిట్స్, జియో రూ.449 ప్లాన్ బెనిఫిట్స్, జియో రూ.98 ప్లాన్ బెనిఫిట్స్
ప్రతీకాత్మక చిత్రం


జియో రూ.299 ప్లాన్: మీరు డేటా ఎక్కువగా ఉపయోగిస్తారా? అయితే రోజూ 3జీబీ డేటా పొందొచ్చు. సినిమాలు, వెబ్‌సిరీస్, క్రికెట్ లాంటివి ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లో చూసేవారికి ఉపయోగపడే ప్లాన్ ఇది. 28 రోజుల వేలిడిటీ ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. జియో సినిమా, జియోటీవీ, ఏజియోతో పాటు ఇతర జియో సేవల్ని పొందొచ్చు.



జియో రూ.398 ప్లాన్: మీరు రోజుకు కనీసం 2 జీబీ డేటా వాడుతుంటారా? అయితే రూ.398 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. 70 రోజుల పాటు రోజుకు 2 జీబీ 4జీ డేటా పొందొచ్చు. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ ఉచితం. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

Reliance Jio Prepaid Plans, Reliance Jio 4G data, JIO 4G plans, Reliance JIO 4G plans,  JIO 98 plan benefits, JIO 1699 plan benefits,  JIO 449 plan benefits, JIO 398 plan benefits, JIO 299 plan benefits, రిలయెన్స్ జియో 4జీ ప్లాన్స్, రిలయెన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్, జియో రూ.1,699 ప్లాన్ బెనిఫిట్స్,  జియో రూ.398 ప్లాన్ బెనిఫిట్స్, జియో రూ.299 ప్లాన్ బెనిఫిట్స్, జియో రూ.449 ప్లాన్ బెనిఫిట్స్, జియో రూ.98 ప్లాన్ బెనిఫిట్స్
ప్రతీకాత్మక చిత్రం


జియో రూ.449 ప్లాన్: మీరు డేటా కాస్త తక్కువగా ఉపయోగిస్తారంటే రూ.449 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. 91 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల పాటు సేవలు పొందొచ్చు. వాయిస్, వీడియో కాల్స్ ఉచితం. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా ఉపయోగించుకోవచ్చు.జియో రూ.1,699 ప్లాన్: మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకోకుండా లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా? అయితే రూ.1,699 ప్లాన్ ట్రై చేయొచ్చు. 365 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా లభిస్తుంది. అంటే 547.5 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్, వీడియో కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి.

Technology: మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

ఆన్‌లైన్‌లో చెప్పులు కొంటున్నారా? ఈ 11 జాగ్రత్తలు తప్పనిసరి
First published: June 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు