రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL తొలిసారిగా వర్చువల్ యాన్యువల్ జనరల్ మీటింగ్ నిర్వహించబోతోంది. జూలై 15న ఈ మీటింగ్ జరగనుంది. రిలయెన్స్ ఏజీఎంకు సంబంధించిన సమాచారాన్ని షేర్‌హోల్డర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, ఈ మీటింగ్‌లో యాక్టీవ్‌గా పార్టిసిపేట్ చేసేందుకు, తమ సందేహాలు, ప్రశ్నలు అడిగేందుకు వాట్సప్ చాట్‌బాట్‌ని ప్రారంభించింది రిలయెన్స్. ఈ చాట్‌బాట్‌ని ఉపయోగించాలంటే 7977111111 నెంబర్ సేవ్ చేసుకొని Hi అని మెసేజ్ చేయాలి. రిలయెన్స్ ఏజీఎం హెల్ప్ డెస్క్‌గా ఈ చాట్ బాట్ పనిచేస్తుంది. షేర్‌హోల్డర్లు మాత్రమే కాదు... సాధారణ ప్రజలు కూడా చాట్‌బాట్ ఉపయోగించొచ్చు.
దేశంలోని 500 ప్రాంతాల నుంచి ఒకేసారి లక్ష మంది ఈ చాట్ బాట్‌ని ఉపయోగించొచ్చు. ఒకేసారి 50,000 ప్రశ్నల్ని హ్యాండిల్ చేసే సామర్థ్యం ఈ చాట్‌బాట్‌కి ఉంది. రిలయెన్స్ ఏజీఎంకు సంబంధించిన సమాచారం, ఫోటోలు, వీడియోలు ఈ వాట్సప్ చాట్ బాట్ ద్వారా పొందొచ్చు. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సబ్సిడరీ హ్యాప్టిక్ టెక్నాలజీస్ వర్చువల్ షేర్‌హోల్డర్ అసిస్టెంట్‌ను రూపొందించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mukesh Ambani, Reliance, Reliance Digital, Reliance Industries, Reliance Jio, RIL, Whatsapp