హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Launch: 2023 డిసెంబర్ నాటికీ దేశమంతా జియో 5జీ సేవలు.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటన

5G Launch: 2023 డిసెంబర్ నాటికీ దేశమంతా జియో 5జీ సేవలు.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటన

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

డిసెంబర్ 2023 నాటికి దేశంలోని ప్రతీ టౌన్, తాలూక, తహసీల్ లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ (Mukesh Ambani) అంబానీ ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

    డిసెంబర్ 2023 నాటికి దేశంలోని ప్రతీ టౌన్, తాలూక, తహసిల్ లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) అన్నారు. అత్యధిక క్వాలిటీ, తక్కువ ధరకే వర్ల్డ్ క్లాస్ 5జీ సేవలు (5G Services) అందిస్తామన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశంలో 5G ఇంటర్నెట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయాన మాట్లాడుతూ.. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఇప్పుడు ఆసియా మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్‌గా మారాలని ఆకాంక్షించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 6వ ఎడిషన్‌ను నిర్వహించినందుకు టెలికాం మంత్రిత్వ శాఖ మరియు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 5జీ సేవ‌ల‌ను ప్రారంభించ‌డం ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌న్నారు. టెలికాం రంగంలో నాయ‌క‌త్వ పాత్ర‌ను పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ వెల్లడించారు.

    5జీ టెక్నాలజీ యొక్క 5 లక్ష్యాలను ముఖేష్ ఈ సందర్భంగా వెల్లడించారు. అవి..

    - తక్కువ ఖర్చుతో బెస్ట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ మరియు నైపుణ్యాభివృద్ధి

    -హై క్వాలిటీ హెల్త్ కేర్, రియల్ టైం క్లినికల్ నిర్ణయాల ద్వారా హాస్పటల్స్ ను 5జీ హాస్పటల్స్ గా మార్పు

    -అర్బర్ మరియు రూరల్ ప్రాంతాల మధ్య అంతరాలను తొలగించానికి వారధిగా 5జీ

    స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి హైటెక్ టూల్ గా 5జీ

    -వరల్డ్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ గా భారత్

    1G to 5G: ఇండియాలో 5G సేవలు ప్రారంభం... 1G నుంచి 5G వరకు టెక్నాలజీ జర్నీ ఇదే

    భార‌తీ ఎయిర్టెల్ సంస్థ చైర్మ‌న్ సునీల్ భార‌తి మిట్ట‌ల్ మాట్లాడుతూ.. ఈ రోజు  దేశంలో మరో కొత్త యుగం ప్రారంభం కానుందని అభివర్ణించారు. 75వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుకలు జరుగుతున్న వేళ ఇది జ‌ర‌గ‌డం సంతోషకరమన్నారు. 5జీ సేవల రాకతో ప్ర‌జ‌ల‌కు అనేక కొత్త అవ‌కాశాలు వ‌స్తాయ‌న్నారు.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G, 5g technology, Mukesh Ambani, Narendra modi

    ఉత్తమ కథలు