Reliance Digital India Sale: అదిరిపోయే ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ప్రారంభం

Reliance Digital India Sale: అదిరిపోయే ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ప్రారంభం (image: Reliance Digital)

Reliance Digital India Sale | రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ప్రారంభమైంది. ఆఫర్స్, డిస్కౌంట్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా సేల్‌ను ప్రారంభించింది రిలయన్స్ డిజిటల్. ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లతో ఈ సేల్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌తో పాటు https://www.reliancedigital.in/ లో ఈ సేల్ ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై ఆగస్టు 16 వరకు కొనుగోలుదారులు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ద్వారా రూ.3,000 వరకు పొందవచ్చు. కనీస రూ.9999/- కొనుగోళ్లపై పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే ఆగస్టు 31 వరకు రూ.500 వ్యాలెట్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. రూ.10,000/- ఆ పైన జరిపే కొనుగోళ్లపై జెస్ట్ మనీ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ + 10% క్యాష్ బ్యాక్ రూ.5,000/-వరకు పొందవచ్చు. ఈ ప్రయోజనాలతో పాటు టెలివిజన్లు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు సహ విస్తృత శ్రేణి ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

    టెలివిజన్ కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు ఎంపిక చేసుకునేందుకు విస్తృతశ్రేణి స్మార్ట్ టీవీలు అతి తక్కువ ప్రారంభ ధర రూ.13,990/- నుంచి అందుబాటులో ఉన్నాయి. సాన్సూయ్ 50-ఇంచుల అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ఇప్పుడు 43-ఇంచుల రకం ధరకు అంటే రూ.29,990/-కే కొనుగోలు చేయవచ్చు. టీసీఎల్ 55-ఇంచుల అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ ప్రత్యేక ధర రూ.44,990/-కి అందుబాటులో ఉంది. దీంతో పాటు రూ.19,990/- విలువ చేసే జేబీఎల్ సౌండ్ బార్ ఉచితంగా పొందవచ్చు.

    Google: మీ గూగుల్ అకౌంట్ ఎంతవరకు సేఫ్? ఈ సెట్టింగ్స్ మార్చండి

    Smartphone Tips: పాత మొబైల్ అమ్ముతున్నారా? డేటా ఇలా డిలిట్ చేయండి


    రూ.16,999/- ప్రారంభ ధరతో అనేక రకాల ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిపై రూ.17,999/- వరకు విలువైన లాభాలు అందుకోవచ్చు. 16 GB ర్యామ్‌తో కూడిన శక్తిమంతమైన గేమింగ్ ల్యాప్‌టాప్ రూ.64,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. లెనొవో M8 32 GB ట్యాబ్లెట్ ప్రత్యేక ధర రూ.11,499/-కి అందుబాటులో ఉంది.

    ఇక మొబైల్ ఫోన్లలో అందరూ అమితంగా కోరుకుంటున్న వన్ ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు తిరుగులేని ధర.29,999/- కే అందుబాటులో ఉంది. డిజిటల్ ఇండియా సేల్ సందర్బంగా ఎస్పీఓ2తో కూడిన సరికొత్త స్మార్ట్‌వాచ్ ఫైర్ బోల్ట్ ఆగ్ని రూ.2,699/- కే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన ఫోన్లు కొనుగోలు చేసే కస్టమర్లు రూ.7,999/- విలువైన ట్రూ వైర్లెస్ బీటీ ఇయర్ ఫోన్ పొందవచ్చు.

    Yono SBI App: ఎస్‌బీఐ యోనో లైట్ యాప్‌లో లభించే బ్యాంకింగ్ సేవలు ఇవే

    Oneplus Nord 2 vs Oneplus Nord CE: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

    ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పైన కూడా అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. ఎల్జీ, సామ్సంగ్, వర్ల్ఫూల్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేట్లు రూ.23,990/- ప్రారంభ ధర నుంచి ఉన్నాయి. వీటితో రూ.3,850/- విలువైన ఉచిత బహుమతులు కూడా ఉన్నాయి. రూ.12,990/- నుంచి టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిపై రూ.1,990/- విలువైన ఉచిత బహుమతులు పొందవచ్చు. కుక్ టాప్ కాంబో (రీకనెక్ట్ 3 బర్నర్ కుక్ టాప్, + 500 వాట్స్ మిక్సర్ + ఎలక్ట్రిక్ కెటిల్) రూ.4,499/-కి పొందవచ్చు. వాటర్ ఫ్యూరిఫైయర్ కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.1999/- విలువైన ఎలక్ట్రిక్ కెటిల్ ఉచితంగా పొందవచ్చు.

    సులభమైన ఫైనాన్సింగ్, ఈఎంఐ ఆప్షన్స్తో డిజిటల్ ఇండియా సేల్స్ ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా ఉంది. కస్టమర్లు ఇన్స్టా డెలివరీ (3 గంటల్లోపు డెలివరీ), సమీపంలోని స్టోర్ నుంచి స్టోర్ పికప్ ఆప్షన్ను కస్టమర్లు పొందవచ్చు. కొనుగోలుదారులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని స్టోర్లు, డెలివరీ భాగస్వాములందరూ కూడా కొవిడ్ భద్రతా చర్యలను కచ్చితంగా పాటిస్తున్నారు.
    Published by:Santhosh Kumar S
    First published: