Home /News /technology /

RELIANCE DIGITAL FESTIVAL OF ELECTRONICS SALE WILL BE LIVE FROM 3RD OCTOBER WITH AMAZING OFFERS AND DISCOUNTS SS

Reliance Digital: అదిరిపోయే ఆఫర్స్‌తో వచ్చేసిన రిలయన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్

Reliance Digital: అదిరిపోయే ఆఫర్స్‌తో వచ్చేసిన రిలయన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్

Reliance Digital: అదిరిపోయే ఆఫర్స్‌తో వచ్చేసిన రిలయన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్

Reliance Digital Electronics Festival | రిలయన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 3న ప్రారంభం కానుంది. ఆఫర్స్, డిస్కౌంట్స్ వివరాలు తెలుసుకోండి.

    ఈ పండగ సీజన్‌ను మరింత వేడుకగా జరుపుకునేందుకు ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్‌ను (Reliance Digital Electronics Festival) తీసుకువచ్చింది రిలయన్స్ డిజిటల్. మీకు నచ్చిన టెక్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుకోండి. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌తో పాటు www.reliancedigital.in లో ఈ సేల్ అక్టోబర్ 3 నుంచి మొదలవుతుంది. అన్ని ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్స్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.2,000 వరకు కొనుగోలుదారులు పొందవచ్చు. స్టోర్స్‌లో అక్టోబర్ 3 నుంచి 12వరకు జరిపే కొనుగోళ్లపై, www.reliancedigital.in లో అక్టోబర్ 3 నుంచి 10 వరకు జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. పేటీఎం ద్వారా కనీస చెల్లింపు రూ.4,999 పై రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇవేకాదు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్‌పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.

    Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో రేపటి నుంచి సేల్... రూ.20,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.14,099 ధరకే కొనండి ఇలా

    టీవీల్లో సాంసంగ్ నియో క్యూలెడ్ కొనుగోలుపై 3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% వరకు క్యాష్‌బ్యాక్, రూ.37,400 విలువైన సాంసంగ్ సౌండ్ బార్ పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఎల్జీ ఓలెడ్ రేంజ్ స్మార్ట్ టీవీలపై 3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.

    ప్రముఖ బ్రాండ్లు ఎల్జీ, సాంసంగ్, వర్ల్పూల్‌కు చెందిన ఫ్రాస్ట్ ప్రీ రిఫ్రిజిరేటర్లు అద్భుతమైన ప్రారంభ ధర రూ.19,990 నుంచి దొరుకుతున్నాయి. అంతే కాదు డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ.12,490.

    వాషింగ్ మెషీన్స్ శ్రేణిలో టాప్ లోడ్ రూ.12,990/- ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫ్రంట్ లోడ్ మెషీన్లు నమ్మశక్యం కాని ధర రూ.18,990/- నుంచి అందుబాటులో ఉన్నాయి.

    Online Shopping Tips: రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో సేల్... ఆన్‌లైన్ షాపింగ్ టిప్స్ మీకోసమే

    కోర్ ఐ3 ల్యాప్టాప్స్ రూ.37,999/- నుంచి ప్రారంభం, గేమింగ్ ల్యాప్ టాప్స్ ధర రూ.63,999 నుంచి ప్రారంభం. రూ.75,999 ప్రారంభ ధరతో హెచ్పీ విక్టస్ ఇంటెల్ గేమింగ్ ల్యాప్టాప్స్ రేంజ్ ప్రత్యేకంగా రిలయన్స్ డిజిటల్లోనే అందుబాటులో ఉంది. అంతే కాదు ఎంపిక చేసిన ల్యాప్టాప్స్ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లతో కూడా రూ.11,963 విలువైన వైర్లెస్ ఆడియో, ఐటీ యాక్సెసరీ యాడ్ ఆన్స్ పొందండి.

    మొబైల్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లతో కూడా భారీ క్యాష్ బ్యాక్ కూడా ఉంది. లేటెస్ట్ ఐఫోన్ 13పై ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.3000తో రూ.6,000 భారీ క్యాష్బ్యాక్. అంతే కాదు వన్ప్లస్ నార్డ్ సీఈ విశిష్ఠ ప్రయోజనాలతో ప్రారంభ ధరు రూ.24,999 నుంచి అందుబాటులో ఉంది.

    Mi 11x 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.9,000 డిస్కౌంట్... అమెజాన్‌లో ఆఫర్

    అంతే కాదు, హోమ్ అప్లయన్సులపైన కూడా మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. శాండ్విచ్ మేకర్, ఎలక్ట్రిక్ కెటిల్, ఉదయపు శుభారంభం కోసం రూ.5,093 విలువైన హావెల్స్ హాట్ & కోల్డ్ బాటిల్, బ్రేక్ఫాస్ట్ కాంబోగా రూ.1,699కే పొందండి.

    సులభమైన ఫైనాన్సింగ్, ఈఎంఐ ఆప్షన్స్తో ఈ ఎలక్ట్రానిక్స్ పండగ ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా ఉంది. కస్టమర్లు ఇన్స్టా డెలివరీ* (3 గంటల్లోపు డెలివరీ), సమీపంలోని స్టోర్ నుంచి స్టోర్ పికప్* ఆప్షన్ను కస్టమర్లు పొందవచ్చు. కొనుగోలుదారులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని స్టోర్లు, డెలివరీ భాగస్వాములందరూ కూడా కొవిడ్ భద్రతా చర్యలను కచ్చితంగా పాటిస్తున్నారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile News, Mobiles, Reliance, Reliance Digital, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు