Reliance Offers: రిలయెన్స్ డిజిటల్‌లో 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్'... కేజీ బంగారం గెలుచుకునే ఛాన్స్

Reliance Digital Festival of Electronics Sale | అక్టోబర్ 5 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా ఉన్న రిలయెన్స్ డిజిటల్, మైజియో స్టోర్స్‌లో టెలివిజన్స్, హోమ్ అప్లయెన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, యాక్సెసరీస్‌పై ఈ ఆఫర్లు పొందొచ్చు.

news18-telugu
Updated: October 4, 2019, 5:22 PM IST
Reliance Offers: రిలయెన్స్ డిజిటల్‌లో 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్'... కేజీ బంగారం గెలుచుకునే ఛాన్స్
Reliance Offers: రిలయెన్స్ డిజిటల్‌లో 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్'... కేజీ బంగారం గెలుచుకునే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
దసరా, దీపావళి పండుగ సీజన్‌లో కొత్త టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ లాంటివి కొనాలనుకుంటున్నారా? మీకు రిలయెన్స్ డిజిటల్ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 5న 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' సేల్ ప్రారంభించబోతోంది రిలయెన్స్ డిజిటల్. దేశవ్యాప్తంగా ఉన్న రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌లో అద్భుతమైన డీల్స్, ఆకర్షణీయమైన ఆఫర్స్‌ పొందొచ్చు. ఎలక్ట్రానిక్స్‌పై 15% క్యాష్‌బ్యాక్‌తో పాటు యాక్సెసరీస్‌పై 10% అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాదు... కొందరు లక్కీ కస్టమర్లు ఒక కిలో బంగారం, లగ్జరీ కార్లు, మోటార్ సైకిళ్లు, ఎల్ఈడీ టీవీ, ల్యాప్‌టాప్, ఐఫోన్స్ గెలుచుకోవచ్చు. వీటితో పాటు ఏజియో వోచర్, జియోసావన్ ప్రో ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బడ్జెట్ ఇబ్బందిగా ఉన్నవాళ్లకు రిలయెన్స్ డిజిటల్‌లో ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అక్టోబర్ 5 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా ఉన్న రిలయెన్స్ డిజిటల్, మైజియో స్టోర్స్‌లో టెలివిజన్స్, హోమ్ అప్లయెన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, యాక్సెసరీస్‌పై ఈ ఆఫర్లు పొందొచ్చు.



ప్రతీ కస్టమర్ రిలయెన్స్ డిజిటల్‌లో లభించే ప్రతీ ప్రొడక్ట్‌ను ప్రత్యక్షంగా పరీక్షించి చూడొచ్చు. తమకు నచ్చిన ప్రొడక్ట్స్ ఎంచుకోవచ్చు. అద్భుతమైన ఆఫర్లు, తక్కువ ధరలతో ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌ను అందిస్తోంది రిలయెన్స్ డిజిటల్. పండుగ సీజన్‌లో ఇంట్లోకి కొత్త వస్తువులు కొనాలన్నా, ఎవరికైనా బహుమతులు ఇవ్వాలన్నా రిలయెన్స్ డిజిటల్ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' సేల్‌లో ఆఫర్ల గురించి www.reliancedigital.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. రిలయెన్స్ డిజిటల్ భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రీటైలర్. 6700 పట్టణాల్లో 7700 జియో స్టోర్స్, 2000+ మైజియో స్టోర్స్, 370+ లార్జ్ ఫార్మాట్ రిలయెన్స్ డిజిటల్ స్టోర్స్ ఉన్నాయి.

Photos: రిలయెన్స్ ట్రెండ్స్‌ ప్రారంభోత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి

ఇవి కూడా చదవండి:

Reliance Jio Plans: రోజుకు 1.5 జీబీ డేటా... రూ.149 నుంచి రిలయెన్స్ జియో ప్లాన్స్

SBI Charges: ఎస్‌బీఐ ఛార్జీల్లో మార్పు... మనీ ట్రాన్స్‌ఫర్, మంత్లీ బ్యాలెన్స్ కొత్త ఛార్జీలు తెలుసుకోండి

IRCTC: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ టెక్నిక్‌తో రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
Published by: Santhosh Kumar S
First published: October 4, 2019, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading