దీపావళి సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సేల్ (Festival of Electronics Sale) ప్రారంభమైంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ప్రముఖ బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. కస్టమర్లు ఈజీ ఈఎంఐ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ఇన్‌స్టా డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. కస్టమర్లకు షాపింగ్ సందర్భంలో లభించే వోచర్లను తర్వాతి కొనుగోళ్లపై రీడీమ్ చేసుకోవచ్చు. రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ (Reliance Digital Stores), మై జియో స్టోర్స్‌తో పాటు www.reliancedigital.in వెబ్సైట్లో ఫెస్టివల్ ఆఫర్స్ పొందొచ్చు. రిలయన్స్ డిజిటల్ ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో లభిస్తున్న ఆరు ప్రముఖ ఆఫర్స్ గురించి తెలుసుకోండి.
1. Smartphones: స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్‌తో కలిపి ఐఫోన్ 12 మొబైల్‌ను రూ.29,900 నుంచే కొనొచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.13,999 మాత్రమే. ఇక సాంసంగ్ ఎస్22 మొబైల్‌ను రూ.52,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.
JioBook: స్మార్ట్‌ఫోన్ ధరకే జియోబుక్ రిలీజ్... అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చిన ల్యాప్‌టాప్
2. Smartwatches: రిలయన్స్ డిజిటల్లో స్మార్ట్ వాచ్‌లపైనా ఆఫర్స్ ఉన్నాయి. స్మార్ట్ వాచ్‌ల ప్రారంభ ధర రూ.999 మాత్రమే. బ్లూటూత్ కాలింగ్ వాచ్‌ల ధర రూ.1499 నుంచి ప్రారంభం అవుతుంది. యాపిల్ వాచ్‌లు రూ.14990 నుంచి కొనొచ్చు.
3. Smart TVs: స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. సాంసంగ్ నియో QLED, టీసీఎల్ QLED స్మార్ట్ టీవీలను రూ.36,990 నుంచి కొనొచ్చు. సాంసంగ్ నియో QLED స్మార్ట్ టీవీ కొంటే రూ.21,490 విలువైన సాంసంగ్ మొబైల్ ఏ32 స్మార్ట్‌ఫోన్ ఉచితంగా లభిస్తుంది. ఐదేళ్ల వారెంటీ పొందొచ్చు.
4. Soundbar: దివాళీ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? జేబీఎల్ సౌండ్‌బార్ 5.1 మోడల్‌ను రూ.56,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. 12 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో ఇయర్‌బడ్స్‌ని కేవలం రూ.15,999 ధరకు కొనొచ్చు.
55 inch Smart TV: అదిరిపోయే ఆఫర్... రూ.30 వేల లోపే 55 అంగుళాల 4K స్మార్ట్ టీవీ... 3 రోజులే ఛాన్స్
5. Appliances: వాషింగ్ మెషీన్ల ప్రారంభ ధర రూ.19,490 మాత్రమే. రెండేళ్ల వారెంటీ లభిస్తుంది. రిలయన్స్ డిజిటల్లో సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కొంటే స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ లాంటి గిఫ్ట్స్ కూడా పొందొచ్చు.
6. Laptops: ల్యాప్టాప్స్ కొనాలనుకునేవారికి మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ ల్యాప్టాప్స్ ధర రూ.49,999 నుంచే ప్రారంభం అవుతుంది. ఇక ఇంటెల్ కోర్ ఐ5 ల్యాప్టాప్స్ ప్రారంభ ధర రూ.38,999.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diwali 2022, Reliance Digital, Smart TV, Smartphone