హోమ్ /వార్తలు /technology /

Reliance Digital: ఈ నెల 17 వరకు రిలయన్స్‌ డిజిటల్‌ డిస్కౌంట్‌ డేస్‌ సేల్‌.. అదిరే ఆఫర్ల వివరాలివే

Reliance Digital: ఈ నెల 17 వరకు రిలయన్స్‌ డిజిటల్‌ డిస్కౌంట్‌ డేస్‌ సేల్‌.. అదిరే ఆఫర్ల వివరాలివే

ఏప్రిల్  2వ తేదీ నుంచి ఏప్రిల్‌ 17వ తేదీ వరకు డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్‌(Digital Discount Days Sale)ను రిలయన్స్ డిజిటల్(Reliance Digital) ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఏప్రిల్  2వ తేదీ నుంచి ఏప్రిల్‌ 17వ తేదీ వరకు డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్‌(Digital Discount Days Sale)ను రిలయన్స్ డిజిటల్(Reliance Digital) ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఏప్రిల్  2వ తేదీ నుంచి ఏప్రిల్‌ 17వ తేదీ వరకు డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్‌(Digital Discount Days Sale)ను రిలయన్స్ డిజిటల్(Reliance Digital) ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్‌ 17వ తేదీ వరకు డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్‌(Digital Discount Days Sale)ను రిలయన్స్ డిజిటల్(Reliance Digital) ప్రకటించింది. వివిధ రకాలకు చెందిన టెక్ ప్రొడక్టులపై ఆకర్షణీయమైన డీల్‌లు, డిస్కౌంట్‌లను వినియోగదారులకు అందించనుంది. ఈ సరికొత్త డీల్‌లు, డిస్కౌంట్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లు, మై జియో స్టోర్స్, జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని రిలయన్స్‌ డిజిటల్‌ స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్‌ వస్తువులపై అందిస్తున్న డీల్స్‌, డిస్కౌంట్లతో పాటు అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లు, రూ.2,000 వరకు విలువైన కూపన్‌లపై 7.5 శాతం తక్షణ తగ్గింపును రిలయన్స్ డిజిటల్ అందిస్తోంది. రూ.80,000లు అంతకంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 10,000ల వరకు అదనపు తగ్గింపు అవకాశాన్ని కూడా రిలయన్స్‌ డిజిటల్‌ సంస్థ కల్పిస్తోంది.

  అన్ని రకాల సరికొత్త టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్‌లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్‌లు, వాషింగ్ మెషీన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు రిలయన్స్ డిజిటల్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయని, వకొత్త ప్రొడక్ట్స్‌ అన్నింటికీ రిలయన్స్‌ డిజిటల్‌ రిటైల్ స్టోర్‌లు గో-టు డెస్టినేషన్‌గా ఉంటాయని సంస్థ తెలిపింది. డిజిటల్‌ డిస్కౌంట్‌ డేస్‌ సేల్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్న రోజుల్లో వంట గది ఉపకరణాలపై కూడా ప్రత్యేక రాయితీలను అందిస్తున్నట్లు రిలయన్స్‌ డిజిటల్‌ స్పష్టం చేసింది.

  రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్‌ అందుబాటులో ఉన్న అన్ని రోజుల్లో.. సరికొత్త Samsung Galaxy S22+ గ్రీన్ కలర్ వేరియంట్ సాధారణ ధర రూ.84,999కు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. సేల్ డీల్స్‌ను అదనంగా కల్పిస్తారు. తాజాగా విడుదలైన iPhone 13 రూ.61,900కి అందుబాటులో ఉంటుంది. అదనంగా క్యాష్‌బ్యాక్, స్టోర్‌లో అందుబాటులో ఉన్న తగ్గింపు, ఎక్స్‌చేంజ్‌ బోనస్‌ పొందే అవకాశం రిలయన్స్‌ డిజిటల్‌ కల్పిస్తోంది. రిలయన్స్‌ డిజిటల్‌ వినియోగదారులు ఇండియాస్‌ ఫస్ట్‌ 12వ జనరేషన్‌ కోర్‌ i5 హెచ్‌పీ ల్యాప్‌టాప్‌పై ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు.

  Smart Phone: మార్కెట్‌లోకి దూసుకొస్తున్న కొత్త ఫోన్‌లు.. అదిరిపోయే ఫీచ‌ర్స్ వివ‌రాలు!

  16GB RAM, 512GB SSD స్టోరేజ్, 39.6cm (15-అంగుళాల) ఫుల్-HD స్క్రీన్‌ ఫీచర్లతో హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ వస్తోంది. విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పని చేసే ఈ ల్యాప్‌టాప్‌ మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 2021తో వస్తుంది. దీని ధరను రూ. 71,999గా రిలయన్స్‌ డిజిటల్‌ పేర్కొంది. దీని పైన రూ. 6,000 లేదా రూ. 2,000 వరకు తక్షణ తగ్గింపు మరియు రూ.5,833 వద్ద నో కాస్ట్ EMI పొందే సదుపాయం ఉందని రిలయన్స్ డిజిటల్‌ స్పష్టం చేసింది. అదనంగా ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌లపై రూ.12,000ల వరకు విలువైన ప్రయోజనాలను రిలయన్స్‌ డిజిటల్‌ అందిస్తోంది. అదే విధంగా ఆయా ల్యాప్‌టాప్‌ రకాలపై అదనంగా 5 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందే అవకాశం ఉంది. EMI సదుపాయాలను కూడా కల్పిస్తోంది.

  కొత్త AC, రిఫ్రిజిరేటర్‌ని కొనాలనే ఆలోచనలో ఉంటే.. వీటిపై రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్ ఆఫర్‌లను అందిస్తోంది. ఫైవ్‌ స్టార్‌ LG 6-ఇన్-1 కన్వర్టిబుల్‌ విత్‌ ఏఐ డ్యూయల్‌ ఇన్వెర్టర్‌ ఏసీ 1.5 టాన్‌ను రూ.2,799త తక్కువ ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. జపనీస్ సాంకేతికతతో కూడిన పానాసోనిక్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్‌ను అతి తక్కువ ఈఎంఐ రూ. 3,999తో సొంతం చేసుకోవచ్చు. 55-అంగుళాల UHD స్మార్ట్ టీవీలపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.

  రూ.34,990కి Sansui TV, రూ. 36,990కి Toshiba TV, రూ.39,990కి BPL TVలు సేల్‌లో అందుబాటులో ఉంటాయి. Samsung QLEDలపై(55-అంగుళాలు అంతకంటే ఎక్కువ) 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్, రెండు సంవత్సరాల వారంటీని పొందవచ్చు. Samsung Soundbar T420 బ్లాక్‌ను రూ.10,990 (MRP రూ. 16,990)కి కొనుగోలు చేసే అవకాశం ఉంది. Samsung సౌండ్‌బార్‌ను కొనుగోలు చేసిన తర్వాత.. Google Home Mini Smart Speaker లేదా JBL Live 25BT బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ను ఉచితంగా అందుకోవచ్చు.

  First published:

  ఉత్తమ కథలు