హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Digital India Sale: భారీ ఆఫర్లతో డిజిటల్ ఇండియా సేల్ ప్రకటించిన రిలయెన్స్ డిజిటల్

Digital India Sale: భారీ ఆఫర్లతో డిజిటల్ ఇండియా సేల్ ప్రకటించిన రిలయెన్స్ డిజిటల్

Digital India Sale | మీరు టీవీ కొంటున్నారా? స్మార్ట్‌ఫోన్ తీసుకుంటున్నారా? రిలయెన్స్ డిజిటల్ 'డిజిటల్ ఇండియా సేల్' ప్రకటించింది. 2021 జనవరి 22న ప్రారంభమైన సేల్ జనవరి 26న ముగుస్తుంది.

Digital India Sale | మీరు టీవీ కొంటున్నారా? స్మార్ట్‌ఫోన్ తీసుకుంటున్నారా? రిలయెన్స్ డిజిటల్ 'డిజిటల్ ఇండియా సేల్' ప్రకటించింది. 2021 జనవరి 22న ప్రారంభమైన సేల్ జనవరి 26న ముగుస్తుంది.

Digital India Sale | మీరు టీవీ కొంటున్నారా? స్మార్ట్‌ఫోన్ తీసుకుంటున్నారా? రిలయెన్స్ డిజిటల్ 'డిజిటల్ ఇండియా సేల్' ప్రకటించింది. 2021 జనవరి 22న ప్రారంభమైన సేల్ జనవరి 26న ముగుస్తుంది.

  'డిజిటల్ ఇండియా సేల్' సేల్‌లో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌పై ఎక్స్‌క్లూజీవ్ డీల్స్, ఆఫర్స్ ప్రకటించింది రిలయెన్స్ డిజిటల్. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ లావాదేవీలకూ ఇది వర్తిస్తుంది. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ లావాదేవీలకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది. గరిష్టంగా రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రిలయెన్స్ డిజిటల్, మైజియో స్టోర్‌లో ఈ ఆఫర్లు పొందొచ్చు. రిలయెన్స్ డిజిటల్ 'డిజిటల్ ఇండియా సేల్'లో అనేక ప్రొడక్ట్స్‌పై ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, మొబల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, యాక్సెసరీస్ లాంటి ప్రొడక్ట్స్ డిస్కౌంట్ పొందొచ్చు. కస్టమర్లు రిలయెన్స్ డిజిటల్ స్టోర్, మై జియో స్టోర్స్ లేదా https://www.reliancedigital.in/ వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసి ఇన్‌స్టా డెలివరీ ఆప్షన్ ఎంచుకోవచ్చు. కేవలం 3 గంటల్లోపే ప్రొడక్ట్స్ డెలివరీ అవుతాయి. దగ్గర్లోని స్టోర్‌లో పికప్ ఆప్షన్ కూడా ఉంటుంది.

  Amazon: అమెజాన్‌లో రూ.190 ధరకే ల్యాప్‌టాప్... ఆర్డర్ చేయగానే ఏమైందంటే

  5G Smartphones: రూ.20,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్

  రిలయెన్స్ డిజిటల్ 'డిజిటల్ ఇండియా సేల్'లో ఆఫర్ల వివరాలు చూస్తే ఐఫోన్ 12 మినీ ధర రూ.49,650 నుంచి, సాంసంగ్ వాచ్ ఎల్‌టీఈ (42mm) ధర రూ.15,999 నుంచి ప్రారంభం అవుతుంది. సాంసంగ్ ఎస్ 20 ఎఫ్ఈ 256జీబీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.39,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక ల్యాప్‌టాప్స్ పైన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. డెల్ ఇన్‌స్పిరన్ 5490 ల్యాప్‌టాప్ ధర రూ.61,999 మాత్రమే. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రీఇన్‌స్టాల్ చేసిన 10th Gen i3 ల్యాప్‌టాప్స్ రూ.33,999 ధర నుంచే కొనొచ్చు. Asus E-book 14inch ధర రూ.18,999. రెండేళ్ల వారెంటీ లభిస్తుంది. రూ.7,799 విలువైన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్‌ ప్యాక్‌ను రూ.1,000 ధరకు సొంతం చేసుకోవచ్చు. రెండేళ్ల వారెంటీ కూడా లభిస్తుంది. ఇక గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై 10 శాతం తగ్గింపు పొందొచ్చు.

  టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్స్ ఉన్నాయి. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.12,490 నుంచే ప్రారంభం అవుతుంది. సాంసంగ్ 50 అంగుళాల QLED స్మార్ట్ టీవీ ధర రూ.64,990 నుంచి ప్రారంభం అవుతుంది. రెండేళ్ల వారంటీతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ పొందొచ్చు. ఎల్‌జీ OLED టీవీలను రూ.64,990 ధర నుంచి కొనొచ్చు. మూడేళ్ల వారెంటీతో పాటు మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 55 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలను రూ.34,990 ధర నుంచి కొనొచ్చు. రెండేళ్ల వారెంటీతో పాటు రూ.10,000 విలువైన బహుమతులు పొందొచ్చు.

  WhatsApp: ఈ రెండు సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ సేఫ్... ఇలా మార్చేయండి

  Flipkart: స్మార్ట్‌ఫోన్ ఏడాది వాడిన తర్వాత 100 శాతం మనీబ్యాక్... ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైన ఆఫర్

  ఇక వాషింగ్ మెషీన్లపైనా భారీ ఆఫర్స్ ఉన్నాయి. కెల్వినేటర్ 6 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ను రూ.19,990 ధరకే కొనొచ్చు. సాంసంగ్ 6.5 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ధర రూ.13,990. హేయర్ 195 లీటర్ల రిఫ్రిజిరేటర్ ధర రూ.11,990. పానాసోనిక్ ఎస్‌బీఎస్ రిఫ్రిజిరేటర్ ధర రూ.49,990. పానాసోనిక్ 1.5 త్రీస్టార్ ఏసీ ధర రూ.29,990. ఎల్‌జీ 1.5 త్రీస్టార్ ధర రూ.33,990.

  First published:

  Tags: 5G Smartphone, Android TV, Mobile, Mobile News, Mobiles, Reliance, Reliance Digital, Smart TV, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు