JIO GigaFiber: జియో గిగాఫైబర్‌తో 4K టీవీ, 4K సెట్ టాప్ బాక్స్ ఉచితం

JIO GigaFiber | జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్ తీసుకుంటే కేవలం ప్లాన్ ఛార్జీలు చెల్లిస్తే చాలు. హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితంగా పొందొచ్చు.

news18-telugu
Updated: August 12, 2019, 1:27 PM IST
JIO GigaFiber: జియో గిగాఫైబర్‌తో 4K టీవీ, 4K సెట్ టాప్ బాక్స్ ఉచితం
JIO GigaFiber: జియో గిగాఫైబర్‌తో 4K టీవీ, 4K సెట్ టాప్ బాక్స్ ఉచితం
  • Share this:
రిలయెన్స్ జియో గిగాఫైబర్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. గిగాఫైబర్‌ సేవల్ని పొందే కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది రిలయెన్స్ జియో. గిగాఫైబర్ యాన్యువల్ ప్లాన్ తీసుకున్నవారికి హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీతో పాటు సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ ముకేష్ అంబానీ ప్రకటించారు. 'జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్' పేరుతో ఈ ఆఫర్ ప్రకటించారు. ఈ యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే కేవలం ప్లాన్ ఛార్జీలు చెల్లిస్తే చాలు. హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితంగా పొందొచ్చు. గిగాఫైబర్ ప్లాన్స్ 100 ఎంబీపీఎస్ స్పీడ్ నుంచి 1 జీబీపీఎస్ వరకు ఉంటాయి. రూ.700 నుంచి రూ.10,000 వరకు ప్లాన్స్ ధరలు ఉంటాయి. జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడొచ్చు.

Read this: JIO Gigafiber: జియో గిగాఫైబర్ సేవలపై రిలయెన్స్ క్లారిటీ... ప్రత్యేకతలు ఇవే



రిలయెన్స్ గిగాఫైబర్ సర్వీస్‌ను 2018 ఆగస్ట్‌లో ప్రకటించింది రిలయెన్స్ జియో. 1600 పట్టణాల నుంచి 15 మిలియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ముకేష్ అంబానీ తెలిపారు. 20 మిలియన్ ఇళ్లకు గిగాఫైబర్ సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది రిలయెన్స్. రిలయెన్స్ జియో గిగాఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారికి 1 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. అంటే సెకన్‌కు 1 జీబీ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. దీంతో పాటు ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్ సెటాప్ బాక్స్ ఉచితంగా లభిస్తాయి. అల్ట్రా హై డెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ గిగాఫైబర్‌తో సాధ్యం.

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


ఇవి కూడా చదవండి:

WhatsApp: షాక్... మీ వాట్సప్ హ్యాక్ చేయొచ్చు... ఈ వీడియోనే సాక్ష్యం

WhatsApp: మీ వాట్సప్‌ని అద్బుతంగా మార్చే 8 ఫీచర్లు ఇవే

Reliance Digital: ఏసీ కొంటే ఫ్రిజ్ ఫ్రీ... రిలయెన్స్ డిజిటల్‌లో ఆఫర్ల పండుగ
Published by: Santhosh Kumar S
First published: August 12, 2019, 12:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading