• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • RELIANCE AGM 2021 LIVE RIL CHAIRMAN AND MANAGING DIRECTOR MUKESH AMBANI ANNOUNCED JIOPHONE NEXT SMARTPHONE SS

Reliance AGM 2021: జియో నుంచి స్మార్ట్‌ఫోన్ రిలీజ్... JioPhone Next ప్రత్యేకతలు ఇవే

Reliance AGM 2021: జియో నుంచి స్మార్ట్‌ఫోన్ రిలీజ్... JioPhone Next ప్రత్యేకతలు ఇవే

Reliance AGM 2021 Live | భారతీయులు ఎదురుచూస్తున్న జియో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 10న మార్కెట్లోకి రానుంది.

  • Share this:
    రిలయెన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. గూగుల్‌తో కలిసి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. జియో 4జీ స్మార్ట్‌ఫోన్ రూపొందిస్తుందన్న వార్తలు చాలాకాలంగా వస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు రిలయెన్స్ 44వ ఏజీఎంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ JioPhone Next రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్స్ జియోఫోన్ నెక్స్‌ట్‌లో ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. భారతీయుల కోసం గూగుల్, జియో కలిసి రూపొందించిన ప్రత్యేక స్మార్ట్‌ఫోన్ ఇది. వాయిస్ అసిస్టెంట్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ ఫిల్టర్స్‌తో స్మార్ట్‌కెమెరా లాంటి అనేక ఫీచర్స్ ఉంటాయి సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది.

    Realme Narzo 30 5G: తక్కువ ధరకే మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన రియల్‌మీ

    Realme X7 Max: రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ కొత్త వేరియంట్ వచ్చింది... ఈరోజే సేల్

    చైనా తర్వాత ఒక దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న నెట్వర్క్ రిలయెన్స్ జియో అని ముకేష్ అంబానీ అన్నారు. ఇండియాలో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 40 కోట్లు దాటింది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మొబైల్ డేటా క్యారియర్‌గా జియో అవతరించింది. జియో యూజర్లు నెలకు 630 కోట్ల మంత్లీ డేటా ఉపయోగిస్తున్నారు. డేటా వినియోగంలో ఏడాదిలోనే 45 శాతం వృద్ధి కనిపించింది.

    Redmi Note 10: ఈ స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే

    Mi 11 Lite: ఎంఐ 11 లైట్ వచ్చేసింది... రూ.3,000 డిస్కౌంట్ పొందండి ఇలా

    జియో నెట్వర్క్‌ను విస్తరించేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించారు. స్పెక్ట్రం కోసం రూ.57,123 కోట్లు, నెట్వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.15,183 కోట్లు అదనంగా ఖర్చుచేశామన్నారు. ఇండోర్ కవరేజ్, డౌన్‌లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్ కోసం జియో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుందన్నారు. మరో 20 కోట్ల మంది కస్టమర్లను చేర్చుకోగలిగే సత్తా తమకు ఉందని ముకేష్ అంబానీ తెలిపారు.

    రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL 44వ సర్వ సభ్య సమావేశం కొనసాగుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి కూడా వర్చువల్ మోడ్‌లో యాన్యువల్ జనరల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు.
    Published by:Santhosh Kumar S
    First published: