హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Reliance AGM 2021: జియో 5జీ వచ్చేస్తోంది... కీలక ప్రకటన చేసిన ముకేష్ అంబానీ

Reliance AGM 2021: జియో 5జీ వచ్చేస్తోంది... కీలక ప్రకటన చేసిన ముకేష్ అంబానీ

Reliance AGM 2021: జియో 5జీ వచ్చేస్తోంది... కీలక ప్రకటన చేసిన ముకేష్ అంబానీ

Reliance AGM 2021: జియో 5జీ వచ్చేస్తోంది... కీలక ప్రకటన చేసిన ముకేష్ అంబానీ

Jio 5G Solution | జియో 5జీ నెట్వర్క్ త్వరలో రాబోతోంది. ఇప్పటికే జియో 5జీని పరీక్షించింది రిలయెన్స్.

త్వరలో జియో 5జీ నెట్వర్క్ తీసుకొస్తామని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ప్రకటించారు. 100 శాతం ఇండియాలోనే తయారైన జియో 5జీ సొల్యూషన్‌ను పరీక్షించామని ప్రకటించారు. ఈ పరీక్షలో 1జీబీపీఎస్ స్పీడ్‌ను విజయవంతం అందుకున్నట్టు ప్రకటించారు. జియో 5జీ నెట్వర్క్ లాంఛ్ చేసేందుకు రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చాయని, 5జీ ఫీల్డ్ ట్రయల్స్ కోసం కసరత్తు చేస్తున్నామన్నారు. ఇండియాలో తామే మొదట 5జీ నెట్వర్క్ లాంఛ్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యరంగంలో కూడా 5జీ ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీంతో పాటు విద్యారంగంలో కూడా 5జీ సేవల్ని అందిస్తామన్నారు. రిలయెన్స్ ఫౌండేషన్ స్కూళ్లల్లో 5జీ నెట్వర్క్‌ను పరీక్షిస్తున్నామన్నారు. భారతదేశం 2జీ ముక్త్ మాత్రమే కాదు... 5జీ యుక్త్‌గా మారాలన్నది తమ ఆశయం అని ముకేష్ అంబానీ తెలిపారు.


Realme Narzo 30 5G: తక్కువ ధరకే మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన రియల్‌మీ

Realme X7 Max: రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ కొత్త వేరియంట్ వచ్చింది... ఈరోజే సేల్

ఇండియాలో 5జీ నెట్వర్క్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారంతా. ఇప్పటికే మార్కెట్‌లోకి 5జీ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. 5జీ నెట్వర్క్ వస్తుందన్న ముందుచూపుతో యూజర్లు 5జీ స్మార్ట్‌ఫోన్లు కొంటున్నారు. జియో 5జీ నెట్వర్క్ తీసుకొస్తామని ముకేష్ అంబానీ గతేడాది ప్రకటించడంతో జియో 5జీపై అంచనాలు పెరుగుతున్నాయి.

Redmi Note 10: ఈ స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే

Mi 11 Lite: ఎంఐ 11 లైట్ వచ్చేసింది... రూ.3,000 డిస్కౌంట్ పొందండి ఇలా

రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL 44వ సర్వ సభ్య సమావేశం కొనసాగుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి కూడా వర్చువల్ మోడ్‌లో యాన్యువల్ జనరల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు.

First published:

Tags: 5G, 5G Smartphone, Akash Ambani, Isha Ambani, Jio 5G, Mukesh Ambani, Nita Ambani, Reliance, Reliance Digital, Reliance Foundation, Reliance Industries, Reliance Jio

ఉత్తమ కథలు