JIO Gigafiber: సెప్టెంబర్ 5న జియో గిగాఫైబర్ సేవలు ప్రారంభం

Reliance Jio GigaFiber | బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్‌ను ఒకే ప్యాకేజ్‌లో అందించడమే గిగాఫైబర్ ప్రత్యేకత. గిగాఫైబర్ కోసం గతేడాదే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. 1600 పట్టణాల నుంచి 15 మిలియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ముకేష్ అంబానీ తెలిపారు.

news18-telugu
Updated: August 12, 2019, 12:04 PM IST
JIO Gigafiber: సెప్టెంబర్ 5న జియో గిగాఫైబర్ సేవలు ప్రారంభం
JIO Gigafiber: జియో గిగాఫైబర్ సేవలపై రిలయెన్స్ క్లారిటీ... ప్రత్యేకతలు ఇవే
  • Share this:
బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న గిగాఫైబర్ సేవలపై స్పష్టత ఇచ్చింది రిలయెన్స్ జియో. సెప్టెంబర్ 5న జియో గిగాఫైబర్ సేవలు కమర్షియల్ బేసిస్‌తో ప్రారంభం అవుతుందని, మరో 12 నెలల్లో జియో గిగాఫైబర్ సేవల్ని అందిస్తామని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ ముకేష్ అంబానీ ప్రకటించారు. రిలయెన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయం తెలిపారు. రిలయెన్స్ నుంచి జియో టెలికామ్ సేవలు ఓ సంచలనమైతే... బ్రాడ్‌బ్యాండ్ సెక్టార్‌లో గిగాఫైబర్  మరో సంచలనం కానుంది. 2018 ఆగస్ట్‌లోనే గిగాఫైబర్ సర్వీస్‌ను ప్రకటించింది రిలయెన్స్ జియో. బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్‌ను ఒకే ప్యాకేజ్‌లో అందించడమే గిగాఫైబర్ ప్రత్యేకత. గిగాఫైబర్ కోసం గతేడాదే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. 1600 పట్టణాల నుంచి 15 మిలియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ముకేష్ అంబానీ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా గిగాఫైబర్ సేవల్ని అందిస్తోంది రిలయెన్స్ జియో. 20 మిలియన్ ఇళ్లకు గిగాఫైబర్ సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది రిలయెన్స్.

Reliance Jio GigaFiber: రిలయెన్స్ జియో గిగాఫైబర్ ప్రత్యేకతలు ఇవే



రిలయెన్స్ జియో గిగాఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారికి 1 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. అంటే సెకన్‌కు 1 జీబీ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. దీంతో పాటు ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్ సెటాప్ బాక్స్ ఉచితంగా లభిస్తాయి. అల్ట్రా హై డెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ గిగాఫైబర్‌తో సాధ్యం.

Reliance Jio GigaFiber: రిలయెన్స్ జియో గిగాఫైబర్ ప్లాన్స్ ఇవే...


100 ఎంబీపీఎస్ స్పీడ్ నుంచి 1 జీబీపీఎస్ వరకు ప్లాన్స్ ఉంటాయి. రూ.700 నుంచి రూ.10,000 వరకు ప్లాన్స్ ధరలు ఉంటాయి. జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడొచ్చు.

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు

ఇవి కూడా చదవండి:

WhatsApp: షాక్... మీ వాట్సప్ హ్యాక్ చేయొచ్చు... ఈ వీడియోనే సాక్ష్యం

WhatsApp: మీ వాట్సప్‌ని అద్బుతంగా మార్చే 8 ఫీచర్లు ఇవే

Reliance Digital: ఏసీ కొంటే ఫ్రిజ్ ఫ్రీ... రిలయెన్స్ డిజిటల్‌లో ఆఫర్ల పండుగ
Published by: Santhosh Kumar S
First published: August 12, 2019, 11:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading