Jio తన JioFiber పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్లు, ప్రయోజనాలను ప్రకటించింది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క కొత్త వినియోగదారుల కోసం కంపెనీ ఎంట్రీ ఫీజును సున్నాకి తగ్గించింది. దీంతో పాటు.. కస్టమర్లు ఇప్పటికే ఉన్న పోస్ట్‌పెయిడ్ ప్యాక్‌లపై యాడ్-ఆన్ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ ప్లస్ ప్లాన్లను ప్రకటించారు. కొత్త JioFiber పోస్ట్‌పెయిడ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లతో, వినియోగదారులు నెలకు రూ. 100 లేదా రూ. 200 అదనంగా చెల్లించడం ద్వారా 14 OTT యాప్‌ల కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. కొత్త JioFiber పోస్ట్‌పెయిడ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లలో Disney+ Hotstar, Zee5, Sonyliv, Voot, Sunnxt, Discovery+, Hoichoi, Altbalaji, Eros Now, Lionsgate, ShemarooMe, Universal+, Voot Kids మరియు JioCinema యాప్‌లు ఉన్నాయి.
JioFiber పోస్ట్‌పెయిడ్ రూ. 399 ప్లాన్: JioFiber పోస్ట్‌పెయిడ్ రూ. 399 ప్లాన్‌లో 30 Mbps ఇంటర్ నెట్ స్పీడ్ లభిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌ను తీసుకోవడానికి, కస్టమర్ బేస్ ధరపై నెలకు రూ. 100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారులు 6 OTT యాప్‌లకు యాక్సెస్ పొందుతారు. అదనంగా రూ. 200 చెల్లించడం ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్లస్ ప్లాన్ యాక్టివేట్ చేయబడుతుంది, ఇందులో 14 OTT యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. దీంతో 30Mbps తో Jio పోస్ట్‌పెయిడ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ధర రూ.499 కాగా.. ఎంటర్టైన్మెంట్ ప్లస్ ప్లాన్ ధర రూ.599గా ఉంటుంది.
JioFiber పోస్ట్‌పెయిడ్ రూ. 699 ప్లాన్: JioFiber పోస్ట్‌పెయిడ్ రూ. 699 ప్లాన్ 100 Mbps ఇంటర్ నెట్ స్పీడ్ ను అందిస్తుంది. ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ కోసం నెలకు రూ. 100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది మరియు ఎంటర్టైన్మెంట్ ప్లస్ ప్లాన్‌ను యాక్టివేట్ చేయడానికి నెలకు రూ. 200 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా, 100Mbps తో Jio పోస్ట్‌పెయిడ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ధర రూ. 799 మరియు ఎంటర్టైన్మెంట్ ప్లస్ ప్లాన్ ధర రూ. 899గా ఉంటుంది.
JioFiber పోస్ట్‌పెయిడ్ రూ. 999, రూ. 1499, 2499 మరియు రూ. 3999 ప్లాన్లకు ఇప్పటికే OTT యాప్‌లకు సబ్క్రిప్షన్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ రూ. 999 ప్లాన్‌లో అందుబాటులో ఉంది. మరియు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ మిగిలిన ప్లాన్లలో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Jio fiber, Reliance Jio